Lifestyle: రాత్రి బాగా నిద్రపోయిన తరువాత మరుసటి రోజు అలసిపోయినట్లు అనిపిస్తుందా? కారణం ఇదే..!

చాలా మంది రాత్రి బాగానే నిద్రపోయినా.. మరుసటి రోజు నిద్ర లేవగానే అలసటగా ఉంటారు. నీరసంగా భావిస్తారు. ఇదే విషయమై తాజాగా న్యూమిస్లీప్ సర్వే నిద్ర గురించి కీలక వివరాలు వెల్లడించింది. నిద్రపోయి.. మరుసటి రోజు లేచిన తరువాత నీరసంగా ఉండటానికి కారణం సెల్ ఫోన్ వినియోగమేనని చెప్పింది సర్వే. అర్థరాత్రి వరకు సెల్ ఫోన్ వినియోగించడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుందన్నారు.

Lifestyle: రాత్రి బాగా నిద్రపోయిన తరువాత మరుసటి రోజు అలసిపోయినట్లు అనిపిస్తుందా? కారణం ఇదే..!
New Update

Slpeeing Tips: భారతదేశంలో చాలా మంది, ముఖ్యంగా యువత జనాభాలో 60 శాతానికి పైగా రాత్రి వేళ నాణ్యమైన నిద్రపోతున్నప్పటికీ.. మరుసటి రోజు అలసిపోయినట్లు, నిద్ర మత్తుతో(Health) ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయాన్ని తాజాగా న్యూమిస్లీప్ సర్వే వెల్లడించింది. వివిధ రకాల నిద్ర అలవాట్లు, వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని పరిశోధన తెలిపింది.

యువతలో నిద్ర సమస్యలు..

సర్వే ప్రకారం, 1997 - 2012 మధ్య జన్మించిన 67 శాతం మంది నిద్రకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. రోజంతా ఎనర్జిటిక్ గా, మోటివేట్ గా ఉండటానికి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతంది. ఈ తరం వారు తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి, చైతన్యం నింపుకోవడానికి ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారని సర్వే వెల్లడించింది.

వారి శ్రేయస్సు, పనితీరుకు నాణ్యమైన విశ్రాంతి అత్యంత ప్రాధాన్యత అని సర్వేపై Gen Z తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో, నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా యువ జనాభాలో.. 35 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రజలు సమయానికి పడుకోక నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. సర్వే ప్రకారం, 45 ఏళ్లు పైబడిన వారిలో 44 శాతం మంది వ్యక్తులు కనీసం వారానికి ఒక్కసారైనా రిఫ్రెష్‌గా లేవడం లేదు. ఇది నిద్ర సవాళ్ల ప్రాబల్యాన్ని నొక్కి చెబుతుంది. అదే వయస్సులో ఉన్నవారిలో 56 శాతం మందికి నిద్ర సమస్య ఉంది. మొత్తంమీద, ఈ వయస్సు గల వ్యక్తులలో నిద్ర నాణ్యత సమస్యలు ప్రముఖంగా ఉన్నాయని సర్వే నివేదించింది.

లైట్ స్లీపర్‌ల ప్రాబల్యం (నిద్ర ఆటంకాలు) పెద్దవారిలో ఒక ముఖ్యమైన ధోరణి. 38 శాతం మంది ఈ వర్గంలో ఉన్నారని వెల్‌నెస్ బ్రాండ్ వెల్లడించింది. అయితే, ఈ నిద్ర ప్రభావం 35-44 ఏళ్ల వయస్సులో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ 63 శాతం మంది పెద్దలు తలనొప్పి, మరుసటి రోజు పనిలో ఆసక్తి కోల్పోవడం వంటి పేలవమైన నిద్ర లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

మంచి నిద్ర నాణ్యతపై..

ఈ అంశాలన్నింటి ఆధారంగా, మెరుగైన నిద్ర నాణ్యత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పరిశోధన సంస్థ కీలక సూచనలు చేసింది. మధ్య వయస్సుల వారు నిద్ర సమయంలో చాలాసార్లు మేల్కొంటారు. రాత్రి సైతం ఫోన్‌ చూస్తూ.. అలాగే ఉండిపోతున్నారు. ఈ అలవాట్లు వారి నిద్రను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఫోన్ ను అధికంగా వినియోగించడం వల్ల రాత్రి సరిగా లేక.. ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందన్నారు.  అందుకే ఇలా చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిద్ర కీలకం అని, అందుకే నిద్ర విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు.

Also Read:

అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..

#health-tips #sleeping-tips #health-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe