Sofa Benefits : ఈ విషయం తెలిస్తే సోఫాలో అస్సలు పడుకోరు స్పాంజ్ సోఫా సౌకర్యవంతంగా ఉన్నా అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని, వెన్నునొప్పికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల తుంటి, ఇతర శరీర భాగాలలో నొప్పి, తలనొప్పి వస్తుంది. 7-8 గంటలు నిద్రపోవాలనుకుంటే సోఫాకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Designer Sofa Benefits : మార్కెట్లో చాలా డిజైనర్ సోఫా(Designer Sofa) లు అందుబాటులో ఉన్నాయి. చాలా ఇళ్లలో హాలులో కొంత భాగం సోఫాతో నిండి ఉంటుంది. అందమైన సోఫాలు కూర్చోవడానికి మాత్రమే కాదు, విశ్రాంతికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది ఎక్కువగా సోఫాలోనే నిద్రిస్తుంటారు(Sleeping). కానీ సోఫాలో పడుకోవడం చాలా హానికరం. మంచం కంటే సోఫా సౌకర్యంగా ఉంటుంది. దాని తయారీలో మృదువైన స్పాంజ్ వాడుతారు. ఈ స్పాంజ్ సౌకర్యవంతంగా ఉన్నా అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని, వెన్నునొప్పికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. సోఫాతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిద్రకు బదులు అనేక సమస్యలు: సోఫాలో పడుకున్నప్పుడు కాళ్లు సరిగ్గా పెట్టలేము, కాబట్టి ఎక్కువ సేపు ఒకే భంగిమలో పడుకోవాల్సి వస్తుంది. దీనివల్ల తుంటి, ఇతర శరీర భాగాలలో నొప్పిని వస్తుంది. సోఫాలో పడుకోవడం వల్ల కూడా తలనొప్పి(Head Ache) వస్తుంది. కుటుంబ సభ్యులు తిరిగే ప్రదేశంలో సోఫా ఉండడం వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. కాసేపు అలా పడుకోవాలంటే మాత్రం సోఫాను ఉపయోగించవచ్చు. కానీ మీరు 7-8 గంటలు నిద్రపోవాలనుకుంటే సోఫా వద్దు. మంచి నిద్రకు బదులు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఏ దిక్కన మంచిదంటే.. అయితే ఇంట్లో ప్రతీ వస్తువుకు సరైన వాస్తు దిశలో పెట్టకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంట్లో సుఖ:శాంతులు ఉండాలంటే సోఫాకు కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించడం ముఖ్యమంటున్నారు. అంతేకాదు ఇంట్లో సోఫా పెట్టే విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. జీవితాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు. కొన్ని నియమాల గురించి తెలుసుకోవడం ఖచ్చితంగా పాలో అయితే జీవితంలో ఆనందానికి మార్గం సుగమం చేస్తుందంటున్నారు. ఇల్లు తూర్పు ముఖంగా(East Facing) ఉంటే.. సోఫాను తూర్పుదిశలో పెడితే మంచిది. ఇల్లు ఉత్తర దిశలో ఉండే..ఇంటిలోని సోఫా సెట్‌ను ముందుకు పెట్టుకోవాలి. పశ్చిమం వైపు ఉన్న ఇంట్లో నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. ఇల్లు పడమర వైపు ఉంటే.. సోఫా సెట్‌ను వాయువ్యంలో ఉంచితే బెస్ట్. సోఫా సెట్ తూర్పు మూలలో పెట్టుకోవాలి. దక్షిణం వైపు ఇంట్లో సోఫా సెట్‌ను ఆగ్నేయ దిశన పట్టుకుంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద బెటరా?..నిపుణులు ఏమంటున్నారు? గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #sleeping #health-care #health-problems #best-health-tips #sofa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి