Sleeping Left: నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం, సరిగా నిద్రపోకపోతే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అంతేకాకుండా మానసిక స్థితిపైనా ఎంతో ప్రభావం పడుతుంది. మనలో చాలా మంది రాత్రి సమయంలో వారికి నచ్చిన వైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. కొందరు కుడిపక్కకి తిరిగి పడుకుంటే మరికొందరు ఎడమవైపు నకు తిరిగి పడుకుంటారు. అయితే ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
- ఎడమవైపు నిద్రించడం ద్వారా గురుత్వాకర్షణ మీ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. సులభంగా ఆహారం జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు.
గుండె ఆరోగ్యం:
- గుండె శరీరం ఎడమ వైపు ఉంటుంది. ఎడమ వైపున నిద్రించడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అంతేకాకుండా అలా తిరిగి పడుకోవడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. చాలా అధ్యయనాలు ఎడమ వైపున పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని చెబబుతున్నాయి. శ్వాస సమస్యలు లేదా గురక ఉన్నా ఎడమవైపు తిరిగి పడుకుంటే అలాంటి సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు.
గర్భిణులకు ప్రయోజనాలు:
- గర్భిణీ స్త్రీలకు ఎడమ వైపున పడుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కడుపులోని బిడ్డకు కూడా పోషకాహారం అందడంలో సహాయపడుతుందని అంటున్నారు.
గురక:
- ఎడమవైపు పడుకోవడం వల్ల శ్వాసనాళంలో గాలి మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఇది గురకను తగ్గిస్తుంది. గొంతు, నాలుక కణజాలం వదులుగా మారకుండా దోహదపడుతుంది. గురక శబ్ధాన్ని కూడా బాగా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.