lavender tea Benefits: ఈ రోజుల్లో..టీ రోజువారీ దినచర్యలో ముఖ్యమైన భాగమైయింది. టీలో రకరాల టీలు ఉంటాయి. సీజన్ బట్టి కొన్ని టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీనే తాగుతారు. చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడిగా తాగాలనే కోరిక అందరికి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల టీ తాగితే శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తితోపాటు జలుబు, ఫ్లూ వంటి నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలం అనేక రకాల ఇన్ఫెక్షన్ల వస్తాయి. ఈ సీజన్‌లో వ్యాధి నిరోధకశక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతారు. అయితే జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కాలంటే అత్యంత సుగంధ మొక్క నుంచి తయారైన టీ తాగాలి. ఇది రుచితోపాటు ఆర్యోగానికి మేలు టీలో లావెండర్ టీ ఒకటి. లావెండర్ టీ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
బాడీ డిటాక్స్:
- చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు లావెండర్ టీ చక్కటి పరిష్కారం. ఈ టీ తాగడం వల్ల మన శరీరంలోని మలినాలు బయటికి పోతాయి.
మంచి నిద్ర:
- రాత్రి పడుకునే ముందు లావెండర్ టీ తాగితే మంచి నిద్ర పడుతుంది.
ఫ్లూ నివారణ:
- జలుబు, దగ్గుతో బాధపడుతుంటే.. లావెండర్ టీ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ టీ తాగితే.. జలుబు, జ్వరం సమస్యలు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి అధికం:
- లావెండర్ టీ తాగడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది పని చేస్తుంది.
టీ తయారీ విధానం:
- దీన్ని చేయడానికి, ముందుగా ఒక పాత్రలో నీటిని మరిగించాలి. మీరు ఒక కప్పు నీటి ఆధారంగా టీని సిద్ధం చేస్తుంటే, 5 టేబుల్ స్పూన్ల తాజా లావెండర్ పువ్వులను కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది రెడీ, కావాలంటే తేనె కలుపుకుని తాగవచ్చు. అయితే..ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉంటే.. డాక్టర్లను సంప్రదించిన తర్వాత దీనిని తాగాలి.
ఇది కూడా చదవండి: కాల్చిన శెనగలు తినడం వల్ల ఉపయోగాలు..షుగర్ మొత్తం కంట్రోల్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.