Roasted Garbanzos: కాల్చిన శెనగలు తినడం వల్ల ఉపయోగాలు..షుగర్ మొత్తం కంట్రోల్ కాల్చిన శెనగల్లో ఉంటే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వు ఆమ్లాలతో ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. కాల్చిన శెనగల్లో ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపునొప్పిని దూరం చేస్తుంది. By Vijaya Nimma 23 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Roasted Garbanzos: కాల్చిన శెనగల్లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే శెనగలు సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. పప్పులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్ కణాలను నిర్మించడానికి అలాగే వాటిని రిపేర్ చేయడానికి పనిచేస్తుంది. అయితే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ అవసరం. ఇది కాకుండా శెనగల్లో పుష్కలంగా ఉంది. వేయించిన శెనగల్లో కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. ఇది తింటే చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. దీనివల్ల ఊబకాయం, బరువు పెరగవు. మీరు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం అల్పాహారంగా కాల్చిన శెనగ పప్పును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబూలీ లేదా కాల్చిన శెనగల్లో ఏది బెటర్?: కాబూలీతో పోలిస్తే శెనగల్లో ప్రోటీన్, ఫైబర్ రెండూ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అంతేకాకుండా అధిక మొత్తంలో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, అయితే కేలరీలు, కార్బోహైడ్రేట్ల గురించి మాట్లాడితే కాబూలీలో తక్కువగా ఉంటాయి. పరిమితంగా ఏది తిన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాల్చిన శెనగలతో ఏ వంటకాలు చేయొచ్చు?: ఒక గిన్నెలో కాల్చిన శెనగలను తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, దోసకాయ, పచ్చి వెల్లుల్లి ఆకులు, ఎర్ర కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలపండి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలపాలి. అంతే దీంతో శెనగ చాట్ రెడీ అవుతుంది. కాల్చిన శెనగలతో ప్రయోజనాలు: కాల్చిన శెనగల్లో అధిక ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపునొప్పి ఉండవు. కాల్చిన శెనగలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో కడుపు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆకలి అనిపించదు. ఎక్కువగా తినే అలవాటు ఉండదు కాబట్టి బరువు సులభంగా తగ్గుతారు. కాల్చిన శెనగపప్పులో ఉంటే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు కాల్చిన పప్పును తింటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కాల్చిన శెనగపప్పు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాల్చిన శెనగలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లు ఉండటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ఇది కూడా చదవండి: నేతాజీకి ఇష్టమైన వంటకాలు ఇవే.. బోస్ బర్త్ డే స్పెషల్! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #sugar-control #health-benefits #roasted-garbanzos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి