South Korean: మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి..వీడియో వైరల్..!! దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో యూన్ సుక్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు. By Bhoomi 02 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దక్షిణ కొరియా ( South Korean) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ (Lee Jae-myung)గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి (Attack with a knife) చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. నగరంలోని కొత్త విమానాశ్రయం నిర్మాణ స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన లీపై దాడి జరిగిందని బుసాన్ అత్యవసర అధికారులు తెలిపారు.లీ స్పృహలో ఉన్నారని, అయితే అతని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. దీని గురించి ఇంకా సమాచారం లేదు. లీ మెడను గాయపరిచేందుకు ఆ వ్యక్తి కత్తిలాంటి ఆయుధాన్ని ఉపయోగించాడని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. లీ 2022 అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ యున్ సుక్ యోల్(Eun Suk Yeol)చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. Breaking: South Korean opposition leader Lee jae_myung stabb at press conference https://t.co/bdAxQUIF92 — John De Beloved (@Papacy1988) January 2, 2024 పార్టీ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారి లీని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వార్తా సంస్థ Yonhap ప్రకారం, దాడి చేసిన వ్యక్తి వయస్సు 50, 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొంది. ప్రతిపాదిత విమానాశ్రయ ప్రదేశాన్ని సందర్శిస్తున్న లీపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారని యోన్‌హాప్ చెప్పారు. నివేదికల ప్రకారం, దాడిలో అతని మెడపై సుమారు 1 సెంటీమీటర్ గాయమైందన్నారు. యోన్‌హాప్ ప్రకారం, లీపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగుడు అతని పేరు గల పేపర్ కిరీటం ధరించాడు. దాడి చేసిన వ్యక్తి ఆటోగ్రాఫ్ అడగడానికి లీ వద్దకు వచ్చాడని, ఆపై అకస్మాత్తుగా ముందుకు వెళ్లి అతనిపై కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నారు. వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తిని ఘటనా స్థలంలో అరెస్టు చేసినట్లు యోన్‌హాప్ తెలిపారు. YTN టెలివిజన్‌లో ప్రసారం చేయబడిన, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మరొక వీడియో క్లిప్‌లో, ఒక వ్యక్తి లీపై దాడి చేయడం కనిపించింది. ఈ దాడి తర్వాత లీ కిందపడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: జపాన్ లో ఒక్కరోజులో 155 భూకంపాలు.. వేలాది ఇళ్లు ధ్వంసం..!! #south-korea #attack-with-a-knife #lee-jae-myung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి