Telangana: వచ్చే ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: రేవంత్

వచ్చే ఏడాది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు.

New Update
TG Schools: ఆ సర్కారు బడులకు ఉచిత కరెంటు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

తెలంగాణలో నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రవైటు సంస్థల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అందించే దిశగా రాష్ట్ర సర్కార్‌ మందడుగు వేసింది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. నైపుణ్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు పట్టాలున్న ఉద్యోగాలు దోరకడం లేదని.. అందుకే స్కిల్ వర్సిటీని రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు గుర్తుచేశారు.

Also Read: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం

అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. అప్పట్లో యంగ్ ఇండియా పత్రికను మహాత్మాగాంధీ మొదలుపెట్టారని.. ఆయన స్పూర్తితోనే ఈ యూనివర్సిటీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్ యూనివర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు. 2 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఆ తర్వాత అడ్మిషన్ల సంఖ్యను క్రమంగా 20 వేలకు పెంచుతారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనివర్సిటీలో ఇంటర్‌ తర్వాత మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ, ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వరకు జరిగే సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే కొత్త కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతోనే కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా కోర్సులు అందిస్తామని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌ నిర్మిస్తున్న ఈ యూనివర్సిటీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. మొత్తం 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు.

కోర్సులు ఇవే
1. హెల్త్ కేర్
2. ఫార్మా అండ్ లైఫ్‌ సైన్సెస్
3. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌
4.టూరిజం అండ్ హాస్పిటాలిటీ
5. ఆటోమేటీవ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్
6. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్
7. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ & కామిక్స్‌
8. కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్‌
9. అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫాక్చరింగ్
10. రీటైల్డ్‌ ఆపరేషన్స్‌ అండ్ మేనేజ్‌మెంట్‌
11. ఈ-కామర్స్‌ అండ్ లాజిస్టిక్స్‌
12. పునరుత్పాదక శక్తి (Renewable Energy)
13. ఫుడ్‌ ప్రాసెసింగ్ అండ్ అగ్రీకల్చర్
14. బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌
15. మీడియా, గేమింగ్‌ అండ్ ఫిల్మ్‌
16. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీ కండక్టర్స్‌
17.డిజిటల్ డిజైన్

Advertisment
Advertisment
తాజా కథనాలు