Parade of Planets: జూన్ 3న ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఆరు గ్రహాలను చూడొచ్చు

జూన్ 3న ఆకాశంలో అద్భతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు ఆరు గ్రహాలను చూసే అవకాశం కలగనుంది. బుధుడు, అంగారకుడు, గురు(బృహస్పతి), శని, యురేనస్, నెప్ట్యూన్.. ఈ ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి.

New Update
Parade of Planets: జూన్ 3న ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఆరు గ్రహాలను చూడొచ్చు

Parade of Planets 2024: జూన్ 3న ఆకాశంలో అద్భతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు ఆరు గ్రహాలను చూసే అవకాశం కలగనుంది. బుధుడు, అంగారకుడు, గురు(బృహస్పతి), శని, యురేనస్, నెప్ట్యూన్.. ఈ ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. యురేనస్‌, నెప్ట్యూన్‌ గ్రహాలు మాత్రం శక్తివంతమైన బైనాక్యులర్ లేదా టెలిస్కోప్‌తో చూస్తేనే కనిపిస్తాయి. మిగతా నాలుగు గ్రహాలైన బుధుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలను నేరుగా కళ్లతోనే చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ అరుదైన దృశ్యం కనిపించనుంది. దీన్నే పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇలాంటి అరుదైన దృశ్యం చూసే అవకాశం మళ్లీ 2492 మే 6 వరకు చూడలేం. ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలనుకునేవారు జూన్ 3న సూర్యోదయానికి ముందే నిద్రలేచి గ్రహాలను చూడండి.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి

Advertisment
తాజా కథనాలు