Covid: వరంగల్ లో కరోనా కల్లోలం.. ఆరుగురు చిన్నారులకు కోవిడ్.. ఎంజీఎంలో ట్రీట్మెంట్! రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. వారికి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. By Bhavana 30 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ (Telangana) లో రోజురోజుకి కరోనా (Covid) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ (Warangal) ఎంజీఎం (MGM Hospital) ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో ఎంజీఎంలో కొవిడ్ పేషెంట్ల కోసం 20 పడకలతో స్పెషల్ వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన చిన్నారులకు ఆ స్పెషల్ వార్డులోనే ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. ఆరుగురు చిన్నారులు కూడా వరంగల్ నగరానికి చెందిన వారే. రాష్ట్రంలో ఎక్కువగా చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం నాడు కేసులు తగ్గినప్పటికీ..గడిచిన 24 గంటల్లో మాత్రం దేశ వ్యాప్తంగా 743 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్రారోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 225 రోజుల్లో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. ఒక్క మహారాష్ట్రలోనే 129 కొత్త కేసులు వచ్చాయి. దేశంలో ప్రస్తుతం 3,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఈ భూతం బారిన పడి 7 గురు చనిపోయారు. ఇందులో ముఖ్యంగా కేరళ నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, తమినాడు, ఛత్తీస్‌గఢ్ లలో ఒక్కొక్కరు అని అధికారులు వివరించారు. శీతాకాలం కావడంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కరోనా న్యూ వేరియంట్ అయిన జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేసులు కూడా రానురాను వందల్లోకి చేరిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో కలవరం మొదలైంది. అయితే కొత్త వేరియంట్ తో భయపడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ మళ్లీ ముఖాలకు మాస్క్‌లు వచ్చి చేరాయి. Also read: ఏపీ నిరుద్యోగుకుల గుడ్ న్యూస్..240 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ! #warangal #covid #mgm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి