Bigg Boss: బిగ్‌బాస్‌ షోను ఆపండి..వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు

హిందీలో వస్తున్న బిగ్‌బాస్‌ను వెంటనే ఆపించాలని మహారాష్ట్రలో ఓమహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షోలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్‌లు చాల ఓవర్ చేస్తున్నారని మండిపడింది.

New Update
Bigg Boss: బిగ్‌బాస్‌ షోను ఆపండి..వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు

Bigg Boss Hindi: బిగ్ బాస్ రియాలటీ షో దేశంలో చాలా భాషల్లో వస్తోంది. ఇది ఆల్మోస్ట్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్. హిందీలో అన్నింటికంటే ముందు స్టార్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ 17వ సీజన్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సీజన్ మీద ఓ ప్రజాప్రతినిధి కంప్లైంట్ చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షోను వెంటనే ఆపేయాలని శివసేన(శిందే వర్గం) అధికార ప్రతినిధి మనీషా కయాండే.. ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ని కలిసి బిగ్‌బాస్‌ షోపై ఫిర్యాదు చేశారు. రీసెంట్‌గా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆమె చెప్పారు.

బిగ బాస్ 17 సీజన్‌లో  అర్మాన్ మాలిక్ పాల్గొన్నారు. ఆయన తన భార్య కృతికా మాలిక్‌తో కలిసి జంటగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే తాజాగా జూలై 18న ప్రసారమైన ఎపిసోడ్‌లో అర్మాన్ తన భార్య కృతికాతో కలిసి బెడ్‌ రూమ్‌లో శృతి మించి ప్రవర్తించారు. దీనిపైనే మనీషా కయాండే ఫిర్యాదు చేశారు. ఈ షోను పిల్లలు కూడా చూస్తున్నారు. సినిమాల్లో ఎలాగో తప్పడం లేదు...టీవీ షోల్లో కూడా ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఆపకపోతే కష్టమని మనీషా అంటున్నారు. ఇవి పిల్లలపై తవ్ర ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌ను వెంటనే నిలిపివేయాలని.. సైబర్‌ క్రైమ్‌ చట్టాల కింద కేసు నమోదు చేయాలని మనీషా డిమాండ్‌ చేశారు. ఇది ఏ మాత్రం ఫ్యామిలీ షో కాదని.. ఈ కార్యక్రమాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read:Mumbai: ఐఎన్ఎస్‌ బ్రహ్మపుత్రలో మంటలు

Advertisment
Advertisment
తాజా కథనాలు