Health News : సైనసైటిస్ ఇన్ఫెక్షన్ లక్షణాలేంటి? ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? సైనస్ ఇన్ఫెక్షన్‌ను సైనసైటిస్ అని కూడా పిలుస్తారు . చెడు శ్వాస, జ్వరం, దగ్గు, తలనొప్పి, దంతాలు లేదా దవడలో నొప్పి ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు. చాలా సందర్భాలలో సైనస్ ఇన్ఫెక్షన్లు వైరస్‌ల వల్ల సంభవిస్తాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. By Vijaya Nimma 05 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sinus Infection : సైనస్ ఇన్ఫెక్షన్(Sinus Infection) సోకితే శ్వాస(Breath) తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కళ్లు, ముఖం చుట్టూ వాపు లాంటి సమస్యలు వస్తాయి. సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సైనస్లు మన పుర్రెలో గాలితో నిండిన ప్రదేశాలు. ఇవి ప్రధానంగా నుదిటి, బుగ్గలు, కళ్ళ వెనుక ఉంటాయి. వీటిలో ఏ రకమైన ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సమస్యనైనా సైనసైటిస్ అంటారు. సైనసైటిస్(Sinusitis) ఉన్నవారికి తుమ్ములు ఎక్కువగా వస్తాయి, ముఖం, ముక్కులో తీవ్రమైన నొప్పి ఉండోచ్చు.. తలనొప్పి ఉండవచ్చు. వ్యాప్తి చెందుతుందా? సైనసైటిస్ ప్రధానంగా వైరస్ లేదా బ్యాక్టీరియా(Virus or Bacteria) వల్ల వస్తుంది. సైనసైటిస్ ఉన్న వ్యక్తి ఈ వ్యాధిని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. సైనస్ అంటువ్యాధా కాదా అనేది సైనసైటిస్‌కు కారణమయ్యే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో సైనస్ ఇన్ఫెక్షన్లు వైరస్‌ల వల్ల సంభవిస్తాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సైనస్ బాధితులు లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. సైనస్ చికిత్సను సకాలంలో ట్రిట్‌మెంట్ చేయకపోతే అనేక సమస్యలు రావొచ్చు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం: కొన్నిసార్లు సైనస్‌లు శ్లేష్మంతో నిండి ఉంటాయి. ఇక బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నప్పుడు ఇది సంక్రమణకు కూడా కారణమవుతుంది. మీ సైనస్ ఇన్ఫెక్షన్ 10-14 రోజుల కంటే ఎక్కువ ఉంటే మీకు బాక్టీరియల్ సైనసిటిస్ వచ్చే అవకాశం ఉంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువ. సైనస్ సమస్యలు దాని కారకాల వ్యాప్తిగా కనిపించాయి. కానీ ఇది ఇతర వ్యక్తులలో సంక్రమణకు కారణం కాదు. ఇది కూడా చదవండి: షుగర్ ఉన్నవారు యాపిల్స్ తింటే జరిగేది ఇదే గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-problems #best-health-tips #sinus-infection #sinusitis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి