Telangana: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ ఎవరంటే..

తెలంగాణలో ఖాళీ అయిన నామినేటేడ్ పోస్టులను కాంగ్రెస్ సర్కార్‌ భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

New Update
Telangana: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ ఎవరంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఒక్కొక్కటిగా అన్ని మారుస్తూ వస్తుంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారిని తొలగించింది. మరికొందరైతే సొంతగానే రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే ఇప్పుడు ఖాళీ అయిన ఆ నామినేటెడ్ పోస్టులను కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేస్తోంది.

Also Read: మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్..మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!

ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ను నియమించింది రేవంత్‌ ప్రభుత్వం. సీనియర్ జర్నలిస్ట్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డిని ఈ పోస్టుకు ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో వెలువడిన తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.

publive-image

Also Read: నేను సీబీఐ విచారణకు రాను.. కవిత షాకింగ్ రిప్లై

Advertisment
Advertisment
తాజా కథనాలు