Haryana : ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే

హర్యానాలోని పెళ్లికాని బ్రహ్మచారులు, భార్య చనిపోయిన పురుషులు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయమని చెబుతున్నారు. తమ కోసం పెన్షన్లు, బ్యాచిలర్స్ జన గణన లాంటి డిమాండ్లు నెరవేరుస్తేనే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు.

Haryana : ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే
New Update

Single Haryana Men : దేశంలో నాలుగు విడుతల లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) అయిపోయాయి. మరో మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 25న హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే హర్యానాలోని పెళ్లికాని బ్రహ్మచారులు(Unmarried Bachelors) మాత్రం.. మేము ఈసారి ఓటు వేయమని చెబుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తేనే.. ఓటుకి సిద్దమని అంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. విరేందర్‌ సంగ్వాన్‌ అనే వ్యక్తి 2012లో సమస్త్ అవివాహ్ పురుష్ సమాజ్ (40 ఏళ్లకు పైబడిన పెళ్లి కాని పురుషులు) సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 2022లో ఏకిక్రిత్ రండా యూనియన్ ( భార్య చనిపోయిన పురుషులు) సంఘాన్ని స్థాపించారు.

Also Read: రేపు బీజేపీ కార్యాలయానికి వస్తున్నా.. కేజ్రీవాల్‌ సవాల్

లిఖితపూర్వక హామీ ఇవ్వాలి

ప్రస్తుతం హర్యానాలో పెళ్లి కానీ అలాగే భార్య (Wife) చనిపోయిన పురుషులు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. వీళ్లలో చాలామంది జాత్ కమ్యూనిటీకి చెందినవారు. అయితే వీళ్లందరికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని వాపోతున్నారు. ఈసారి రాజకీయ పార్టీలు తమకు.. పెన్షన్ స్కీమ్‌లు సక్రమంగా అమలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని చెబుతున్నారు. గతంలో తాము బ్యాచిలర్స్‌ జన గణన చేయాలని డిమాండ్‌ చేశామని.. కానీ ఇంతవరకు ఇది చేయలేదని విరేందర్‌ సంగ్వాన్‌ అన్నారు.

సక్రమంగా అమలుకాని పెన్షన్ 

మరోవైపు ఇప్పటికే హర్యానాలో నిరుద్యోగ సమస్య ఉంది. దీనివల్ల యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అలాగే పెళ్లికానీ పురుషుల్లో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. తాము ఎక్కడికి వెళ్లినా కూడా భార్యా, పిల్లలు లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వడం లేదని, ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని బ్రహ్మచారులు వాపోతున్నారు. గత ఏడాది జులైలో.. హర్యానాలో 45 - 60 ఏళ్ల మధ్య ఉన్న పెళ్లికాని పురుషులు, మహిళల కోసం ఒక పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. వీళ్లలో ఏడాదికి 1.8 లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉన్న పెళ్లికానీ పురుషులకు, మహిళలకు.. అలాగే ఏడాదికి రూ.3 లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉన్న వితంతువులకు, భార్య చనిపోయిన పురుషులకు నెలకు రూ.2750 ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒకరిద్దరికీ తప్ప అర్హత ఉన్న ఎవరికీ కూడా ఈ పెన్షన్ రావడం లేదని బ్యాచిలర్, విడోవర్స్‌ సంఘాల సభ్యులు చెబుతున్నారు.

Also Read: మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి.. మల్లికార్జున ఖర్గే డిమాండ్

గత ఏడాదే ఈ రెండు సంఘాలు.. తమ కోసం బ్యాచిలర్స్‌ జనగణన చేయించాలని.. పెన్షన్స్ ఇవ్వాలని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. కానీ ఇప్పటికీ తమ డిమాండ్లు నెరవేరలేవని ఈ సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తమ డిమాండ్లు నెరవేరుస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు.. ఈ పెళ్లి కాని బ్యాచిరల్స్, భార్య చనిపోయిన పురుషుల కోసం ఎలాంటి హామీలు ఇస్తారో అనే దానిపై ఆ రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది.

#lok-sabha-elections #haryana #single-men #unmarried-bachelors
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe