Singireddy Niranjan Reddy : వనపర్తి జిల్లా అభివృద్ధి వెనుక కేసీఆర్ శ్రమ ఉంది

సీఎం కేసీఆర్‌ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

New Update
Singireddy Niranjan Reddy : వనపర్తి జిల్లా అభివృద్ధి వెనుక కేసీఆర్ శ్రమ ఉంది

సీఎం కేసీఆర్‌ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. గతంలో తాను జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాతే మరోసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానని తెలిపినట్లు గుర్తు చేసిన ఆయన.. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయంటే దీని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. ఆ పథకాల వల్ల తెలంగాణ గతంలో ఎన్నడూ లేని విధంగా మారిందన్నారు.

మరోవైపు కాంగ్రెస్, బీజేపీలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓర్వలేక పోతున్నాయన్నారు. రైతులు కేసీఆర్‌ వెంట ఉంటే తాము ఎన్నికల్లో గెలవలేమని విపక్షాలకు అర్థమైందన్నారు. మరోవైపు ఇప్పుడు గ్యారెంటీ కార్డులు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఆధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఇలాంటి పథకాలు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ కాకమ్మ కథలు రైతులకు తెలుసన్న ఆయన.. ఆ పార్టీ ఆరు కాదు కదా.. 20 గ్యారెంటీ కార్డులు ఇచ్చినా విజయం సాధించలేదని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు