పల్లెటూరులో కండోమ్స్ అమ్ముతూ దెబ్బలు తిన్న సింగర్ సునీత కొడుకు

సోమవారం హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే 'ఈ సర్కారు నౌకరి' మూవీకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు. ఈ చిత్రంలో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా కనిపించిన ఆకాష్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. అయితే ఈ కథ తెలంగాణ రాష్ట్రంలోని కొల్లపూర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా..

పల్లెటూరులో కండోమ్స్ అమ్ముతూ దెబ్బలు తిన్న సింగర్ సునీత కొడుకు
New Update

ఓ పల్లెటూరులో కండోమ్స్ అమ్ముతూ దెబ్బలు తిన్నాడు స్టార్ సింగర్ సునీత కొడుకు. అవునా అని షాక్ అవుతున్నారా? నిజమే.. కాకపోతే.. ఇది రియల్ గా కాదు సినిమాలో. సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా 'సర్కార్ నౌకరి' సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ కు జంటగా భావనా వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే డైరెక్టర్ రాఘవేంద్ర రావు డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించినప్పటికీ.. గత కొన్నేళ్లుగా దర్శకత్వాన్ని పక్కన పెట్టి నిర్మాణ సంస్థ 'ఆర్కే టెలీ'షోను స్టార్ట్ చేశారు. ఇది స్థాపించి 25 ఏళ్లు పూర్తి కావడంతో.. సోమవారం హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే 'ఈ సర్కారు నౌకరి' మూవీకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు.

ఈ చిత్రంలో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా కనిపించిన ఆకాష్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. అయితే ఈ కథ తెలంగాణ రాష్ట్రంలోని కొల్లపూర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించాడు దర్మకుడు.

ఈ రిలీజ్ ఫంక్షన్ లో సింగర్ సునీత మాట్లాడుతూ.. బాగా ఎమోషనల్ అయింది. రాఘవేంద్ర రావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను.. ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. నంది అవార్డు లాంటి పురస్కారాలు అందుకున్నప్పుడు కూడా ఇంత భావోద్వేగానికి కూడా గురి కాలేదని, రాఘవేంద్ర రావు లాంటి వారు నా కొడుకు సినిమాను నిర్మించడం ఎంతో హ్యాపీగా ఉందని కన్నీరు పెట్టుకుంది సునీత.

#singer-sunitha #singer-sunitha-son-akash #teaser-release #sarkaru-naukari-movie #hero #sarkaru-naukari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe