Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో.. ఈనెల 27న ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఎన్నికలకు నిర్వహించేందుకు గుర్తింపు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 39,748 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

New Update
Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. అయితే ఇప్పుడు సింగరేణి ఎన్నికలకు నగరా మోగింది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు గుర్తింపు ఎన్నికల సంఘం సిద్ధమైపోయింది. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ శ్రీనివాసులు.. సింగరేణికి చెందిన13 కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. మూడు నెలల క్రితమే డిసెంబర్ 27న ఎన్నికలు జరుగుతాయని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో తాజా ఓటర్ల జాబితాను కార్మిక నేతలకు అందజేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 39,748 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Also read: ఏపీలో తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణకు హెచ్చరిక

ఇదిలాఉండగా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. అక్టోబర్‌ 30 నుంచి సింగరేణి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు. అలాగే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. సింగరేణి ఎన్నికలు తాత్కలికంగా వాయిదాపడడాయి. ఇప్పుడు శాసనసభ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం సింగరేణిలో ఎన్నికలు జరుగుతాయని కార్మికశాఖ పేర్కొంది.

Also Read: ఇప్పుడేం చేద్దాం! బీఆర్‌ఎస్‌లో చేరిన నేతల్లో అయోమయం

Advertisment
Advertisment
తాజా కథనాలు