Singareni : నేడు సింగరేణి ఎన్నికలు.. రాత్రికి ఫలితాలు

ఇవాళ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 39,748 సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

New Update
Telangana: సింగరేణిలో హస్తం హవా.. అధికార పార్టీకి జైకొట్టిన కార్మికులు..!

Singareni Elections : ఈ రోజు జరగనున్న సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లిక్కింపు జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39, 748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలిసారి ఏఐ టియుసి(AITUC) విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు ఏఐటీయూసీ, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐ ఎన్ టి యు సి విజయం సాధించాయి.

సింగరేణి వ్యాప్తంగా వివిధ డివిజన్లో ఉన్న ఓటర్ల వివరాలు
1. బెల్లంపల్లి 986
2. మందమర్రి 4876
3. శ్రీరాంపూర్ 9,124
4. కార్పొరేషన్ 1192
5. కొత్తగూడెం 2370
6. మణుగూరు 2414
7. ఇల్లందు 603
8. నైని (ఒడిస్సా) 2
9. భూపాలపల్లి 5350
10. రామగుండం-1 5430
11. రామగుండం-2 3479
12. అడ్రియాల 947
13. రామగుండం-3 3063
మొత్తం 39,748

Also Read : AP Polls: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. జిల్లాల పర్యటనలో చంద్రబాబు, పవన్

గత ఎన్నికలలో గెలుపొందిన యూనియన్లు
* 1998 ఏఐటీయూసీ 31,938
* 2001 ఏఐటీయూసీ 21,599
* 2003 ఐఎన్టియుసి 30,291
* 2007 ఏఐటీయూసీ 30,385
* 2012 టీబీజీకేఎస్ 23,311
* 2017 టీబీజీకేస్ 23,845
* ప్రధాన పోటీ ఏఐటీయూసీ, ఐ ఎన్ టి వి సి, సిఐటియు, హెచ్ఎంఎస్, బి ఎం ఎస్, టీబీజీకేఎస్.

రీజియన్ వ్యాప్తంగా ఓట్ల వివరాలు
* రామగుండం 12,824
* బెల్లంపల్లి 14,960
* కొత్తగూడెం 6,581
* భూపాలపల్లి 5,410

Also Read : BREAKING : భారత్ లో భారీ భూకంపం!

Advertisment
తాజా కథనాలు