/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/singapore-1.jpg)
Singapore Air Lines Caught In Air Turbulence : సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore Air Lines) కు చెందిన బోయింగ్ విమానం (Boeing Flight) పైకి వెళ్లిన కొద్ది సేపటికే భారీ కుదుపులకు గురైంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం 211 మంది ప్రయాణికులతో , 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ కు చెందిన విమానం బయల్దేరింది.
విమానం పైకి వెళ్లిన కొద్ది సేపటికే మార్గం మధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుని కుటుంబానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ప్రయాణికులకు అదనపు వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదనపు సాయం అవసరమైతే అందించడానికి బ్యాంకాక్ (Bangkok) కు ఓ బృందాన్ని పంపుతున్నామని వివరించింది.
విమానంలోని ప్రయాణికులు ముందస్తు సమాచారం లేకపోవడంతో సీల్ట్ బెల్ట్ ధరించక పోవడం వల్లనే అలాంటి గాయాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. విమానంలో కుదుపులు ఏర్పడతాయని వెదర్ రాడార్ సూచించక పోవడం వల్ల పైలట్ ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు చేయలేక పోయారని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలలో ప్రయాణికులు కుదుపులకు కాక్‌పిట్ లోకి నెట్టివేయబడతారని, గాయాలకు దారి తీస్తాయని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలో ఢిల్లీ సిడ్నీ ఎయిర్ ఇండియా విమానంలో ఇదే విధంగా కుదుపులు ఎదురయ్యాయి. అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Also Read : తాగి ఇద్దరిని తొక్కి చంపితే వ్యాసం రాయమంటారా?.. ఇదెక్కడి న్యాయం అంటున్న నెటిజన్లు!