Tamilnadu : రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ మొదటి సారిగా ఓ ట్రాన్స్ జెండర్ రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన సింధు అనే మహిళా ట్రాన్స్ జెండర్ ఈ ఘనత సాధించారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. By Manogna alamuru 10 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Trans Gender : మన దేశంలో ట్రాన్స్ జెండర్(Trans Gender) లంటే చిన్న చూపు ఉంది. వారికి పని ఇవ్వడానికి కూడా సంకోచిస్తాం. దాంతో చాలా మంది ట్రాన్స్ జెండర్లు భిక్షమెత్తుకుని బతుకుతుంటారు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితాలను తామే రాసుకుంటారు. తాము అందరి లాంటి మనుషులమే అని నిరూపించుకుంటున్నారు. కష్టపడి చదువుకుని ఉద్యోగాలు(Jobs) చేస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్ జెండరే తమిళనాడు(Tamilnadu) కు చెందిన సింధు. బి.(Sindhu. B) లిటరేచర్‌లో పట్టా పొందిన సింధు రైల్వే టికెట్ ఇనెస్పెక్టర్(Railway Ticket Inspector) గా ఉద్యోగం సంపాదించి చరిత్రలో నిలిచింది. ఒక ట్రాన్స్ జెండర్ ఇలా రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా నియమితులవ్వడం ఇదే మొదటిసారి. Also Read : Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ. ఏమీ చేయలేననుకున్నా... తాను రైల్వే ఇనెస్పెక్టర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింధు. తాను ట్రాన్స్ జెండర్ కావడం వలన ఏమీ చేయలేనని అనుకున్నానని...నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి ఎదగడం చాలా ఆనందం కలిగిస్తోందని చెబుతున్నారు. తన లాంటి వారందరికీ తాను ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాని అంటున్నారు. హిజ్రాలు(Hijra) తమ సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో మంచి స్థాయికి చేరుకోవాలని సూచిస్తున్నారు. 19 ఏళ్ళుగా రైల్వేలోనే... సింధు 19 ఏళ్ళుగా రైల్వేలోనే పని చేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో ఉద్యోగంలో చేరారు. తరువాత ట్రాన్స్‌ఫర్ మీద దిండిగల్‌కు బదిలీ అయి వచ్చారు. 14 ఏళ్ళుగా ఇక్కడే పని చేస్తున్నారు. అయితే మధ్యలో ఈమెకు యాక్సిడెంట్ అయింది. దీంతో సింధును రైల్వేలోని వానిజ్య విభాగానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆమె అక్కడే విధులు నిర్వహిస్తూ టికెట్ ఇనెస్పెక్టర్‌గా శిక్షణను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం సింధు దిండిగల్(Dindigul) రైల్వే డివిజన్ టికెట్ ఇనెస్పెక్టర్‌గా నియమితుయ్యారు. జీవితంలో ఏం జరిగినా కుంగిపోకుండా పకి రావొచ్చని అంటున్నారు సింధు. దానికి తానే ఉదాహరణ అని చెబుతున్నారు. తాను ట్రాన్స్ జెండర్ అనో...లేక మధ్యలో యాక్సిడెంట్ అయిందనో డీలా పడిపోయి ఉంటే ఈ రోజు ఈ విజయం దక్కేది కాదని అంటున్నారు. ఈ స్థాయికి రావడానికి తాను చాలా కష్టపడ్డానని...అది లేకుండా ఏమీ చేయలేమని చెప్పారు. Also Read : Telangana:నేడే తెలంగాణ బడ్జెట్ #tamilnadu #sindhu #trans-gender #railway-ticket-inspector మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి