Stress : మీరు చాలా కాలంగా ఒత్తిడితో బాధపడుతూ ఉంటే, ఒత్తిడి ఉపశమనం కోసం సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎదురు చూస్తుంటే జపనీస్ థెరపీ ఎంతో బాగా పనిచేస్తుంది. యాంత్రిక యుగంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజూ ఒకే పని, అదే వాతావరణం ఏ వ్యక్తికైనా విసుగు తెప్పిస్తుంది. ఒకవైపు ఆఫీసు పని, మరోవైపు కుటుంబంలో తలనొప్పులతో మానసిక ప్రశాంతత కరవు అవుతుంది. ఫలితంగా తీవ్ర డిప్రెషన్‌కు గురవుతారు. సహజమైన మార్గంలో ఒత్తిడిని నయం చేసుకోవాలనుకుంటే ఒక అద్భుతమైన జపనీస్ పద్ధతి గురించి తెలుసుకుందాం. ఇది పూర్తిగా ప్రకృతి వైద్యం. దీనిని సాధారణ భాషలో చెప్పాలంటే అటవీ స్నానం అంటారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, దీన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ థెరపీ ఏమిటో తెలుసుకుందాం.
జపనీస్ థెరపీ అంటే:
- జపాన్‌లో ఈ చికిత్సను షిన్రిన్-యోకు అంటారు. దీనిని వాడుకలో అటవీ స్నానం అంటారు. ఇది ప్రకృతితో మనల్ని సమన్వయం చేయడం ద్వారా మన శారీరక, మానసిక రుగ్మతలను నయం చేస్తుంది. షిన్రిన్-యోకు అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రకృతి వైద్యం.
ఎలా చేస్తారు?
- ఈ చికిత్స చేయడానికి మీ ఇంటికి దూరంగా అడవిలో నివసించాల్సి ఉంటుంది. ఇందులో మీరు అడవిలో ప్రకృతి మధ్య జీవిస్తూ మీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తారు. ఈ రకమైన జీవితాన్ని గడపడం ద్వారా ఒత్తిడిని మరచిపోవడానికి ప్రయత్నిస్తారు. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. మరో విషయం ఏంటంటే దీన్ని ఫారెస్ట్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ చికిత్సలో మీరు అటవీ వాతావరణంలో నివసించాలి.
ఈ చికిత్స వల్ల ఉపయోగాలు:
- షిన్రిన్-యోకు థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ థెరపీ చేస్తున్న వ్యక్తి భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అడవి మధ్య ఉన్న ప్రకృతి వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం చేయడం ద్వారా మంచిగా నిద్రపడుతుంది. అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అలాగే బరువు తగ్గాలనుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ కొంత సమయం ప్రకృతిలో గడిపితే అది మిమ్మల్ని అనేక శారీరక, మానసిక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది.
ఇది కూడా చదండి: పిల్లలకు ఉప్పు-పంచదారతో అన్నం పెడుతున్నారా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.