Kacche Aam Ki Chutney : వేసవి(Summer)లో పచ్చి మామిడికాయ పచ్చడి, ఊరగాయ లేకుండా ఆహారం అసంపూర్ణంగా కనిపిస్తుంది. అయితే మీరు ఈ సారి కొత్తగా, వెరైటీగా పచ్చి మామిడికాయ పచ్చడిని రుచి చూడాలనుకుంటే.. గుజరాతీ స్టైల్(Gujarati Style) స్వీట్ పచ్చి మామిడి పచ్చడి(Sweet Raw Mango Pickle)ని ట్రై చేయండి. దీనిని గుజరాతీలో చుండా అని కూడా అంటారు. ఇది తయారు చేయడం చాలా సులభం త్వరగా తయారవుతుంది. రుచిగా ఉండే ఈ చుండను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.
పచ్చి మామిడి చట్నీ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- ఒకటి నుంచి రెండు పచ్చి మామిడికాయలు,
- రెండు తురిమిన ఉల్లిపాయలు,
- ఒక టీస్పూన్ ఉప్పు,
- ఒకటిన్నర టీస్పూన్ వేయించిన జీలకర్ర,
- ఒక టీస్పూన్ ఎర్ర కారం,
- చిటికెడు పసుపు,
- నాలుగు టీస్పూన్ల బెల్లం
పచ్చి మామిడి చుండ తయారు చేసే విధానం
- ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాని పై పొట్టు తీయాలి.
ఆ తరువాత మామిడి కాయను సన్నగా తురుముకోవాలి. అలాగే రెండు ఉల్లిపాయలను కూడా తీసుకుని సన్నగా తురుముకోవాలి.
- ఇప్పుడు ఒక గాజు గిన్నెలో మామిడి తురుము, ఉల్లిపాయల తురుము వేసుకోవాలి.
- దీంట్లో పొడి చేసి పెట్టుకున్న బెల్లం కూడా కలుపుకోవాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమంలో వేయించిన జీలకర్ర, పసుపు, ఎర్ర మిరపకాయలను కలపండి. కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి గాజు పాత్రలో కొన్ని రోజులు ఉంచాలి.
- ఈ పచ్చి మామిడి కొద్దిగా కరిగితే తినడానికి సిద్ధంగా ఉంటుంది. అంతే గుజరాతీ స్టైల్ పచ్చి మామిడి చుండ రెడీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Life Style: స్వీట్స్ అతిగా తింటున్నారా..? అకాల వృద్ధాప్యం తప్పదు..!