Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత ఏంటి..ఈ ఏడాది షష్టి ఎప్పుడు వచ్చింది!

పరమేశ్వరుని రెండో కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయనకు కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అలాగే మురుగన్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. మార్గశిర మాసంలో వచ్చే షష్టిని సుబ్రహ్మణ్య స్వామి షష్టిగా ప్రజలు జరుపుకుంటారు.

New Update
Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత ఏంటి..ఈ ఏడాది షష్టి ఎప్పుడు వచ్చింది!

జాతకంలో ఏమైనా సమస్యలుంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వల్లీ దేవ సమేత ససుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలని పండితులు వివరింస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహ జరగకపోతే స్వామి వారిని దర్శించి పూజించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నాగదోషాలు ఏమైనా ఉంటే తొలిగి పోతాయని పండితులు వివరిస్తున్నారు.

వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగకపోయినా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని పండితులు వివరిస్తున్నారు. ఈ ఏడాది షష్టి డిసెంబర్‌ 18 సోమవారం నాడు వచ్చింది. ఈరోజున స్వామివారిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

పరమేశ్వరుని రెండో కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయనకు కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అలాగే మురుగన్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. మార్గశిర మాసంలో వచ్చే షష్టిని సుబ్రహ్మణ్య స్వామి షష్టిగా ప్రజలు జరుపుకుంటారు. దీనిని సుబ్బరాయుని షష్టి అని, చంపా షష్టి, ప్రవర షష్టి అని కూడా అంటుంటారు.

తమిళులు స్కంద షష్టి అని పిలుస్తారు. వల్లీదేవసేన సమేతంగా ఉన్న స్వామి వారి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. స్వామి వారికి అభిషేకం చేయించినా, అష్టకం చదువుకున్నా కష్టాలు తీరిపోయి స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

మంచి సంతానం కలగాలన్నాఆర్థిక సమస్యలు తీరిపోవాలన్నా, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించాలన్నా, విద్యార్థులు చదువులో మంచిగా రాణించాలన్నాసుబ్రహ్మణ్య ఆరాధన మంచి పరిష్కారం.

Also read: గద్వాల మార్కెట్లో జేబులోనే పేలిన ఫోన్.. షాకింగ్ వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు