గత కొంత కాలం నుంచి మొబైల్ (Mobiles) ఫోన్లు మాట్లాడుతున్నప్పుడో..ఛార్జీంగ్ పెట్టిన సమయంలోనో పేలిపోయిన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో కొందరు తీవ్ర గాయాలపాలైన ఘటనలు, కొన్ని సందర్భాల్లో వ్యక్తులు చనిపోయిన ఘటనలు కకూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గద్వాల్ జిల్లాలో జరిగింది.
గద్వాలకు చెందిన జయరాముడు అనే వ్యక్తి శనివారం సాయంత్రం కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ వ్యాపారులతో మాట్లాడుతున్న క్రమంలో ప్యాంట్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు ఎక్కువగా వ్యాపించకముందే అప్రమత్తం అయిన జయరాముడు ఫోన్ ని తీసి బయట పడేశాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. సెల్ ఫోన్లు ఉపయోగించేవారు పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లు పేలిపోవటానికి ముఖ్య కారణం బ్యాటరీలే అని నిపుణులు చెబుతున్నారు. అవి ఎక్కువగా హిట్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ వేడిగా అనిపిస్తే..దానిని ఉపయోగించ కూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే పలు రకాల ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు.
Jio Phone Fire Telangana Gadwal district pic.twitter.com/G5nfgKN5JI
— Naru FF (@Narsimha22666) December 16, 2023
Also read: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే 10 వేల లోపు ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!