విశాఖపట్నం పెద్దజాలరిపేటలో సునామీరోజును పురస్కరించుకోని మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర మంత్రి సిదిరీ అప్పల రాజు హాజరయ్యారు. మత్స్యకారులు గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ , పీకే కలయికను వైసీపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికే అక్కడ ఓ పీకే ఉన్నాడు..ఇప్పుడు కొత్తగా మరో పీకే చేరాడు..అంతే తప్ప అక్కడ అంతకు మించి ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు.
కేవలం వైసీపీ పై భయంతోనే పీకేని కలిశారని అప్పలరాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీలో జనసేనని కలిపి వేయవచ్చని జోస్యం చెప్పారు. వైసీపీలో రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయే తప్ప అంతకు మించి ఏం జరగడం లేదని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గం మార్చుకుంటే తప్పు లేదు కానీ... తాము కో ఆర్డినేటర్‌లను మార్చుకుంటే భయపడినట్టా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై ప్రతిపక్ష పార్టీలు కాక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అనుకున్న సమయానికి సీఎం వైజాగ్ నుంచి పాలన సాగిస్తారని అప్పలరాజు పేర్కొన్నారు.
Also read: పవన్ కల్యాణ్ కాపుల కలలను చెరిపేసాడు: తోట త్రిమూర్తులు!