Sitara Ghattamaneni Interview : మహేష్ బాబు - నమ్రతల ముద్దుల కుమార్తె సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తండ్రికి తగ్గ కూతరు అనిపించుకుంది. సోషల్ ఫుల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో నెటిజన్స్ ను ఆకుట్టుకుంటున్న సితార తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొంది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నాన్నకి అలా చేస్తే అస్సలు నచ్చదు
రీసెంట్ గా మహేష్ అండ్ ఫ్యామిలీ ఓ వెడ్డింగ్ కి వెళ్లారు. ఆ వెడ్డింగ్ లో మంజుల మహేష్ జుట్టును టచ్ చేస్తూ ఆటపట్టించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో సితారను అడిగితే.. " ఆ వెడ్డింగ్ లో మంజుల అత్త డాడీ జుట్టు పట్టుకున్నారు. అప్పుడు డాడీ అత్తతో డోంట్ టచ్ మై హెయిర్ అని అన్నారు. ఎవరైనా హెయిర్ టచ్ చేస్తే డాడీకి అసలు నచ్చదు. అందుకే అత్త డాడీని ఆటపట్టించేందుకు జుట్టు పట్టుకుందని" నవ్వుతూ చెప్పింది.
అమ్మ, నాన్నల నుంచి నేర్చుకుంది ఇదే
ఇదే ఇంటర్వ్యూలో మీ పేరెంట్స్ నుంచి నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటని అడగ్గా.. అమ్మ నమ్రత నుంచి ఫ్యాషన్ సెన్స్, నాన్న మహేష్ బాబు నుంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తన అన్న గౌతమ్ ను ఆట పట్టించడం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అన్నయ్య నుంచి ఎంత ఓపిగ్గా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది. దీంతో సితార చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.