భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్‌ఐ.. చివరికి ఏం జరిగిందంటే

భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై ఎస్‌ఐ దారుణానికి పాల్పడ్డాడు. కేసు విచారిస్తున్నక్రమంలో యువతిని బెదిరించి ఎస్‌ఐ సహదేవన్‌ పలుసార్లు లైంగిక దాడిచేశాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్‌ఐని జైలుకు తరలించారు.

భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్‌ఐ.. చివరికి ఏం జరిగిందంటే
New Update

దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా చట్టాలను సరైన మార్గంలో అమలు చేసి స్త్రీలను కాపాడాల్సిన పోలీసులే లైంగిక దాడులకు పాల్పడుతూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సాయం కోసం వచ్చిన మహిళలను లొంగతీసుకుని కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి సమాజం సిగ్గుపడే దారుణమైన ఘటన చెన్నైలో జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Also read : జూబ్లీహిల్స్‌లో ఇల్లు కబ్జాకు సినీ నటి యత్నం.. షాక్ ఇచ్చిన పోలీసులు

ఏరియూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి జిల్లాకు చెందిన పళనిస్వామి (28)కి 17 ఏళ్ల బాలికతో 2020లో బాల్యవివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత ఎనిమిది నెలల క్రితం భర్తతో గొడవల కారణంగా బాలిక ఏరియూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాల్యవివాహం చేసుకున్నట్లు గుర్తించిన ఎస్ ఐ సహదేవన్.. ఆమె భర్త పళనిస్వామి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త పళనిస్వామి మరోసారి ఆమెపై దాడి చేయడంతో ఆమెను హోంకు తరలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ హోంలో ఉన్న బాలిక.. చైల్డ్‌ హెల్స్‌లైన్‌ నెంబరును సంప్రదించి ఎస్‌ఐ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారిస్తున్న ఎస్‌ఐ సహదేవన్‌ (55) యువతిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తెలింది. ఈ వ్యవహారం మరింత పెద్దదవగా కోర్టు ఉత్తర్వులతో పెన్నాగరం మహిళా పోలీస్ స్టేషన్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్‌ఐని అరెస్ట్‌ చేసి ధర్మపురి శాఖా జైలుకు తరలించారు.

#woman #sexually-assaulted #si
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe