drug: డ్రగ్స్‌ కేసులో ఎస్సై అరెస్ట్.. ఇంట్లోనే దందా

భాగ్యనగర్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. పోలీస్ అధికారి ఇంట్లోనే డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్సైని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో ఓ కేసులో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

New Update
drug: డ్రగ్స్‌ కేసులో ఎస్సై అరెస్ట్.. ఇంట్లోనే దందా

ఇంట్లోనే డ్రగ్స్ దండా నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రాయదుర్గం పోలీసులు (Rayadurgam Police). ఎవరైనా తప్పు చేస్తే పట్టుకొని శిక్షించాల్సిన పోలీసులు.. తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. స్మగ్లర్ల నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని అధికారులకు అప్పజెప్పకుండా ఓ ఎస్సై ఇంట్లోనే దాచుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్సైగా రాజేందర్  ( Si Rajender) పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్లను రాజేందర్ నేతృత్వంలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆ డ్రగ్స్‌ను అధికారులకు గానీ, కోర్టు గానీ అప్పజెప్పకుండా ఇంట్లోనే ఉంచుకోని దందా నిర్వహిస్తున్నాడు ఎస్సై రాజేందర్.

డ్రగ్స్ స్వాధీనం

గతంలోను రాయదుర్గంలో ఎస్సైగా పనిచేసినప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హండ్రెడ్‌గా ఎస్సై రాజేందర్ దొరికారు. ఏసీబీ కేసులో కోర్టు రాజేందర్‌కు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తరాలు కూడా జారి చేసింది. కోర్టు జారీ చేసిన ఉత్తరాలపై రాజేందర్ స్టే తెచ్చుకుని తిరిగి మళ్లీ విధుల్లో చేరారు. రాజేందర్ ప్రస్తుతం నార్కోటిక్ టీమ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో చేసిన ఓ అపరేషన్‌లో పాల్గొన్న రాజేందర్ అక్కడ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సీజ్ చేసిన డ్రగ్స్‌ ( drug case) ను కోర్టులో డిపాజిట్ చేసే సమయంలో తక్కువగా చూపించారు. అనుమానంతో దీంతో ఎస్సై రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. ఉన్నతాధికారుల విచారణలో నిజాలు తేలడంతో ఎస్సై రాజేందర్‌ (Si Rajender)ను అరెస్టు చేశారు.

సీక్రెట్‌గా అమ్మాలని

అక్రమంగా నిల్వ ఉన్న డ్రగ్స్‌ సుమారు రూ. 80 లక్షలు విలువైన 1750 గ్రాముల మాదక ద్రవ్యాలను పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను ఇంట్లో పెట్టుకోని సీక్రెట్‌గా అమ్మాలని చూశాడు. ఎస్సై చేసిన పనికి డిపార్ట్‌మెంట్‌ అధికారులు షాకయ్యారు. ఇంట్లోనే లాకర్‌లో డ్రగ్స్‌ ఉండటంతో ఈసారి ఏవిధంగా తప్పించుకోలేకపోయ్యాడు ఎస్సై రాజేందర్.

Advertisment
తాజా కథనాలు