Prabhas: ప్రభాస్ తీరుపై శ్యామలాదేవి ఆవేదన..కృష్ణంరాజు చివరి కోరిక తీర్చలేదంటూ.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య సతీమణి శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం కృష్ణంరాజు చివరి కోరికని తెలిపింది. By Archana 12 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Prabhas: రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య సతీమణి శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే ప్రభాస్ పేరు ముందే ఉంటుంది. ఈ ఆరడుగుల అందగాడు పెళ్లి కోసం తన కుటుంబ సభ్యుల తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా ఈవెంట్స్, మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించినప్పుడు అడిగే మొదటి ప్రశ్న ప్రభాస్ మీ పెళ్ళెప్పుడు. ఎన్ని సార్లు అడిగిన ఒక చిన్న స్మైల్ ఇస్తూ ప్రభాస్ ఆ ప్రశ్నను తెలివిగా దాటేస్తాడు. ఇదే విషయంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి మాట్లాడుతూ .. ప్రభాస్ అంటే వాళ్ళ పెదనాన్నకు ఎంతో ప్రేమ .. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళ పెదనాన్న చివరి కోరిక.. తన పిల్లలతో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడ్డారని చెపుతూ ఎమోషనల్ అయ్యారట. అయితే ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చున్నప్పటికీ వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు కోరిక మాత్రం తీర్చలేదని శ్యామల దేవీ వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పుడు ఇదే విషయం పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి. ప్రభాస్ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో చాలా రూమర్స్ నడిచాయి. కానీ అందులో ఏ ఒక్క దాంట్లో కూడా వాస్తవం లేనట్లు తెలిసింది. ఇటీవలే ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకున్నట్లు వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా ఉన్నట్లు క్రియేట్ చేసిన AI ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్, అనుష్క సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఫోటోలపై ఎలాంటి స్పందన చేయలేదు. #prabhas #prabhas-marriage #pan-india-star-prabhas #shyamala-devi-comments-on-prabhas-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి