Indoor Shuttle Court : రాత్రికి రాత్రే షెటిల్ కోర్ట్ నేలమట్టం.. పుంగనూరులో కొత్త టెన్షన్! పుంగనూరులో రాత్రికి రాత్రే షటిల్ కోర్టును కొందరు దుండగులు నేలమట్టం చేశారు. దాదాపు రూ.60 లక్షల విలువైన ఆస్తిని ధ్వంసం చేశారు. దీంతో క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఫౌండర్స్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. By Nikhil 07 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Chittoor : చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో మరో కొత్త వివాదం చెలరేగింది. రాత్రికి రాత్రే ఇండోర్ షెటిల్ కోర్ట్ (Indoor Shuttle Court) ను గుర్తు తెలియని వ్యక్తులు నేలమట్టిం చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో సుమారు రూ.60 లక్షల ఆస్తి ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కి షెటిల్ కోర్టు ఫౌండర్స్ ఫిర్యాదు చేశారు. షెటిల్ కోర్టును ధ్వసం చేయడానికి రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా మరేదైన కారణాలు ఉన్నాయా? అన్న విషయంపై పోలీసులు దృష్టిసారించారు. షెటిల్ కోర్టును ధ్వసం చేసిన ప్రాంతాన్ని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు. Your browser does not support the video tag. ఎన్నికలు (Elections) ముగిసిన నాటి నుంచి పుంగనూరు (Punganur) నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. అక్కడ రాజీకీయాలు సైతం మారిపోతున్నాయి. స్థానిక మున్సిపల్ చైర్మన్, 12 మంది కౌన్సిలర్లు సైతం వైసీపీని వీడి టీడీపీ (TDP) గూటికి చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపిస్తున్నారు. Also Read : “హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్”.. సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెష్ #tdp #punganur #peddireddy-ramachandra-reddy #indoor-shuttle-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి