Ind Vs Eng: గిల్ తో అండర్సన్‌ గొడవ.. సిక్స్ వీడియో వైరల్!

ఇంగ్లాండ్‌ ప్లేయర్ జేమ్స్‌ అండర్సన్‌తో వివాదంపై భారత బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ స్పందించాడు. అతని బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత జరిగిన చాటింగ్‌ గురించి మాట్లాడటం బాగోదన్నాడు. తమ మధ్య ఏమీ జరిగిందనేది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిదని చెప్పాడు.

New Update
Ind Vs Eng: గిల్ తో అండర్సన్‌ గొడవ.. సిక్స్ వీడియో వైరల్!

Shubman: భారత యంగ్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ఇంగ్లాండ్‌ ప్లేయర్ జేమ్స్‌ అండర్సన్‌తో వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన గిల్ మరోసారి అధ్భుత ప్రదర్శనతో భారత్ కు భారీ స్కోర్ అందించాడు. వన్డే తరహాలో ధాటిగా ఆడిన గిల్ 12 ఫోర్లు, 5 సిక్స్ లు బాదీ ఔరా అనిపించాడు. అయితే ఈ క్రమంలోనే అండర్సన్ బౌలింగ్ సిక్స్ కొట్టడంతో బౌలర్ కాస్త దురుసుగా వ్యవహరించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం మాట్లాడాడు గిల్.

బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది..
‘మా నాన్న కోరుకున్నట్లుగా నేను ఆడుతున్నా. అదే స్థాయిలో ప్రదర్శన చేస్తున్నా. తప్పకుండా నా ఆట పట్ల నాన్న గర్వంగా ఫీల్ అవుతారు. బంతిలో అనుకున్నంత మేర కదలిక లేదు. బ్యాట్‌ మీదకు అస్సలు రాలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే, కాస్త అడ్వాంటేజ్ తీసుకుని అండర్సన్‌ బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శించా. ప్రతిసారీ మంచి ప్రదర్శనే ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నా. కానీ, నాణ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాననే అనుకుంటా. ఇక అండర్సన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత జరిగిన చాటింగ్‌ గురించి మాట్లాడటం బాగోదు. మేం ఏం అనుకున్నామనేది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిదని నా ఫీలింగ్’ ఏమీ చెప్పకుండా దాటవేశాడు.

ఇది కూడా చదవండి: DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ!

గిల్ ఓపెనర్‌గానే రావాలి..
ఇక తన కుమారుడు ఓపెనర్‌గా రావాలని గిల్ తండ్రి లఖ్విందర్‌ చెబుతున్నాడు. ‘అండర్ -16 రోజుల నుంచి గిల్ స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడటం చేసేవాడు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరిగేది. కానీ, ఇటీవల మాత్రం అలా చేయడం లేదు. సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శిస్తేనే పరుగులు చేయడం సులువు. అప్పుడే ఆత్మవిశ్వాసంతో ఆడగలం. గిల్ స్క్వేర్‌ కట్, కవర్‌ డ్రైవ్‌తో కొట్టే షాట్లు అద్భుతంగా ఉంటాయి. ఇటీవలకాలంలో అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఓపెనర్‌గా ఆడితే అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుందని నమ్ముతా. నంబర్ 3లో ఒత్తిడి తారాస్థాయిలో ఉంటుంది. అతడి ఆట కూడా వన్‌డౌన్‌కు సరిపోదు. ఛెతేశ్వర్‌ పుజారా డిఫెన్సివ్‌తో బంతిని ఎదుర్కొంటాడు. అయితే, నేను సూచనలు చేసినప్పటికీ.. ఓ తండ్రిగా అతడు తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తా. అందులో నేను అస్సలు కలగజేసుకోను’ అంటూ తన మనసులో మాట బటయపెట్టాడు.

Advertisment
తాజా కథనాలు