రహస్యంగా పెళ్లి చేసుకున్నశృతి హాసన్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ

నటి శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాను రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలపై స్పందించింది. నాకు ఇంకా పెళ్లికాలేదు. అయినా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను కదా. అలాంటపుడు మా మ్యారేజ్ గురించి ఎందుకు దాస్తాను' అంటూ అవన్నీ ఫెక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

రహస్యంగా పెళ్లి చేసుకున్నశృతి హాసన్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
New Update

Shruti haasan : స్టార్ నటి శృతి హాసన్ (shruti haasan) మ్యారేజ్ (Marriage) ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికా (Santanu Hazarika)తో ఆమె డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే పలుసార్లు ఈ జోడీ రకరకాల కారణాలతో వార్తల్లో నిలిచింది. శృంగారం, బెడ్ రూమ్ లో న్యూడ్ ఫొటోలతోపాటు వెకేషన్స్ లోనూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న శృతిహాసన్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. అంతేకాదు తన హాబిట్స్ గురించి కూడా నెట్టింట తరచూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించే నటి తాజాగా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్హాన్ అవత్రమణి అలియాస్‌ ఓరీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్‌ వివాహం చేసుకుదంటూ హింట్‌ ఇచ్చాడు. దీంతో అవత్రమణి కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు. పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ తో నటిని ఆడేసుకుంటున్నారు. మరికొంత మంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే అన్ని జరిగిపోయాయని, ఇందులో వింత ఏముందంటూ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వార్తలపై స్పందించిన శృతి.. పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తమని, ఇదంతా ఓ పుకారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఖండించింది. ‘నాకు ఇంకా పెళ్లికాలేదు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాంటపుడు నా పెళ్లి గురించి ఎందుకు దాస్తాను' అంటూ కొట్టిపారేసింది. దీంతో ఆమె అభిమానులు శాంతించారు.

ఇది కూడా చదవండి : TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

ఇక శృతి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్‌’ (Salaar)లో హరోయిన్ గా నటించి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే . అడివి శేష్‌ హీరోగా రాబోతున్న అప్ కమింగ్ మూవీ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకులను అలరించబోతుంది. అంతేకాదు ఆమె నటించిన హాలీవుడ్‌ మూవీ ‘ది ఐ’ త్వరలోనే రిలీజ్ కాబోతుండగా ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#shruti-haasan #married #shantanu-hazarika
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe