Shraddha Kapoor :పెళ్లిగురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్...లేటెస్ట్ పోస్టులో అర్థం అదేనేమో? బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఫొటోలతో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. Acchi lag rahi hun, Shaadi kar lun ?? 😝 పెళ్లి చేసుకోవాలా ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు వైరల్ గా మారింది. By Bhoomi 04 Feb 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. బ్యూటీఫుల్ ఫొటోలతో పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. Acchi lag rahi hun, Shaadi kar lun ??? 😝 అంటూ క్యాప్షన్ పెట్టింది.పెళ్లి చేసుకోవాలా అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్ధా పెళ్లి గురించి హింట్స్ ఇస్తుందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆదివారం, శ్రద్ధా కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో చాలా అందమైన చిత్రాలను పంచుకుంది. తెల్లటి ఎంబ్రాయిడరీ సల్వార్ సూట్లో దేవకన్యలా కనిపిస్తోంది. అందంగా, బాగున్నాను..పెళ్లి చేసుకోవాలా? అంటూ తన అభిమానులను అడుగుతున్నట్లు శ్రద్ధ క్యాప్షన్ ఇచ్చింద. "నేను బాగానే ఉన్నాను, నేను పెళ్లి చేసుకోవాలా???" అని రాసింది. దాదాపు అన్ని ఫొటోలకు అలాంటి క్యాప్షనే ఇచ్చింది. శ్రద్ధా పోస్ట్‌ను పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు కామెంట్ బాక్స్లోప్రశ్నల వర్షం కురిపించారు. మిమ్మల్ని వధువుగా చూడాలని ఎదురు చూస్తున్నాను."ఓ నెటిజన్ అంటే "మేము వేచి ఉన్నాము!" మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "దయచేసి కార్లో, మీకు వరుడు దొరికాడా?" అంటూ ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. శ్రద్ధ గతేడాది రణబీర్ కపూర్‌తో కలిసి 'తూ ఝూథీ మైన్ మక్కర్' చిత్రంలో కనిపించింది. ఇప్పుడు 2018 హిట్ చిత్రం 'స్త్రీ' మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ 'స్త్రీ 2' లో నటించనుంది. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావుతో శ్రద్ధా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31, 2024న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. #bollywood-actress #shraddha-kapoor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి