Shraddha Kapoor: ఇన్‌స్టాలో శ్రద్ధా రికార్డు.. 92.1 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్

శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ నటిగా రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. 92.1 మిలియన్ ఫాలోవర్లతో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను అధికమించింది. ఈ లిస్ట్ లో విరాట్ కొహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

New Update
Shraddha Kapoor: ఇన్‌స్టాలో శ్రద్ధా రికార్డు.. 92.1 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్

Shraddha Kapoor: ఇటీవలే 'స్ట్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్. హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిందీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. 10 రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లను రాబట్టింది. తొలిరోజే రూ. 58.20 కోట్లతో ఫైటర్, కల్కి వంటి భారీ చిత్రాల రికార్డును బ్రేక్ చేసింది. అంచనాలకు మించి ప్రేక్షకులను అందుకుంటోంది ఈ చిత్రం.

Shraddha kapoor

ప్రియాంక చోప్రాను బీట్ చేసిన శ్రద్ధా

అయితే తాజాగా శ్రద్ధా మరో కొత్త ఫీట్ సాధించింది. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ నటిగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన లిస్ట్ లో విరాట్ 270 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రెండవ స్థానంలో 91.1 మిలియన్ తో గ్లోబల్ ఐకాన్ నటి ప్రియాంక చోప్రా కొనసాగుతోంది. తాజాగా  ప్రియాంకను బీట్ చేసింది శ్రద్దా. 92.1 మిలియన్ తో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయురాలిగా రెండవ స్థానం సొంతం చేసుకుంది.

Also Read: Kannappa: ‘కన్నప్ప’ లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు