Kannappa: 'కన్నప్ప' లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..?

మంచు విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సినిమా నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్‌ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

New Update
Kannappa: 'కన్నప్ప' లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..?

Kannappa:  టాలీవుడ్ హీరో మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. స్టార్ కాస్ట్ ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, సంపత్ తదితరులు ఈ చిత్రంలో  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాపై ఆసక్తిని పెంచేలా మూవీలోని పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చేస్తూ పోస్టర్లను రిలీజ్  చేస్తున్నారు మేకర్స్.

అయితే తాజాగా మరో స్పెషల్ రోల్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. రేపు శ్రీకృష్ణష్టామి సందర్భంగా సినిమా నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్‌ మంచు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'కన్నప్ప' లో అవ్రామ్‌ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మంచు వారి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో అవ్రామ్‌ పాత్ర ఏంటి..? లుక్ ఎలా ఉండబోతుంది..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

Ava ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ప్రభుదేవ కొరియోగ్రఫీ చేస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్ అందిస్తున్నారు. స్వయంగా మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Sarangapani Jathakam: ప్రియదర్శి ‘సారంగపాణి జాత‌కం’ ఫస్ట్ లుక్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు