Arvind Kejriwal: 'ఆధారాలుంటే చూపించండి'.. ఈడీని కోరిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం 2.30 PM నాటికి వాటిని బయటపెట్టాలని కోరింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్
New Update

Arvind Kejriwal Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ (ED) వరుసగా తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమన్లు జారీ చేసిన ఈడీ.. గురువారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును (High Court) ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంపై ఈరోజు (గురువారం) విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కీలక ఆదేశాలు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2.30 PM నాటికి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరింది.

Also Read: ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్ పై సుప్రీం కోర్టు స్టే 

సమన్లు చట్టవిరుద్ధం

అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి మావద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఇటీవల ఈడీ వెల్లడించిన నేపథ్యంలో తాజాగా ఢీల్లీ హైకోర్టు.. ఆ వివరాలను బయటపెట్టాలని న్యాయస్థానాన్ని కోరింది. ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఈడీ పలుమార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసినప్పటికీ.. తనకు జారీ చేసిన సమన్లు చట్టవిరుద్దమైనవని ఆరోపిస్తూ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరిస్తూ వస్తున్నారు.

కావాలనే చేశారు

అయితే బుధవారం రోజున హైకోర్టు.. ఈడీ ముందు ఎందుకు హాజరుకావడం లేదని అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. దీంతో ఆయన తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేజ్రీవాల్‌ ఈడీ ముందు హాజరవుతారని చెప్పారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నందువల్ల.. ఆయనకు బలవంతపు చర్యల నుంచి రక్షణ అవసరమని కోరారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ మధ్యం కేసుతో ముడిపడిఉన్న అవినీతి, మనీలాండరింగ్‌ కేసుపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికే.. ఆప్‌ నేతలైన మనీష్‌ సిసోడియా, సంజయ్ సింగ్‌లు ఈ కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు.

Also Read: ఇదేం పాడు బుద్ధి.. ఈ మొగుడు నాకొద్దు.. ఓ ఇంజనీర్ భార్య నిజాయితీ!

#aravind-kejriwal #delhi-liquor-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe