హర్యానాలో మారుతోన్న లెక్కలు.. బీజేపీ గెలుపు ఖాయం?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లిన హస్తం పార్టీకి బీజేపీ బ్రేకులు వేసింది. 46 సీట్లలో ఆధిక్యం దిశగా దూసుకొచ్చింది. కాషాయ నేతలు సంబరాలు స్టార్ట్ చేయగా.. కాంగ్రెస్ ఆఖరి రౌండ్లపై ఆశలు పెట్టుకుంది.

New Update

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. 46కు పెగా సీట్లలో ఆధిక్యం చాటుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తాము హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. చివరి రౌండ్లలో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతలు మాత్రం గెలుపుపై ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయని వారు అంచనా వేసుకుంటున్నారు. జులానాలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వినేష్‌ ఫోగట్‌ వెనుకబడ్డారు. అక్కడ బీజేపీ అభ్యర్థి యోగేశ్ బైరాగి ముందంజలో కొనసాగుతున్నారు. హోంమంత్రి అనిల్ విజ్ వెనుకంజలో ఉన్నారు. ఇండిపెండెంట్ గా హిస్సార్‌ నుంచి పోటీలో ఉన్న సావిత్రి జిందాల్ గెలుపుదిశగా పయనిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు