యూపీలో సమాజ్‌వాది పార్టీ (samajvadi party)నేత స్వామి ప్రసాద్ మౌర్య(swamy prasad mourya)పై దుండగుడు దాడి చేశాడు. అడ్వకేట్ దుస్తులు ధరించిన ఆగంతకుడు స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరాడు. అప్రమత్తమైన కార్యకర్తలు అతన్ని పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాజ్ వాది పార్టీ నిర్వహిస్తున్న ఓబీసీ కన్వెన్షన్ కార్యక్రమంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. దుండగున్ని పోలీసులు విభూతిఖండ్ పోలీసు స్టేషన్ కు తరలించినట్టు సమాచారం. దాడికి గల కారణాలు ఏంటనే విషయాన్ని తెలుసుకునే పోలీసులు ఉన్నారు. ఈ దాడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా యూపీ రాజకీయాల్లో స్వామి ప్రసాద్ మౌర్య బలమైన నేతగా కొనసాగుతున్నారు. మొదట ఆయన ఎస్పీలో కీలక నేతగా వున్నారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ ఎస్పీలో చేరి ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతున్నారు. 1996లో మొదట సమాజ్ వాది పార్టీ తరఫున దాల్ మౌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా కూడా వున్నారు. 2009లో ఆయన బీఎస్పీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవిని మాయావతి అప్పగించారు. ఆ తర్వాత 2012లో బీఎస్పీ ఘోర ఓటమి నేపథ్యంలో ఆయన్ని పదవి నుంచి తొలగించారు. అనంతరం 2017లో బీజేపీలో చేరారు. 2017లో బీజేపీ ప్రభుత్వం రావడంతో ఆయనకు కేబినెట్ పదవి ఇచ్చారు.