Hardik Pandya: ఈ సీజన్ ఐపీఎల్ స్టార్టింగ్ కు ముందే షాకులిస్తోంది. వేలానికి ఆదివారం విడుదల చేసిన రిటైన్ లిస్టులో ఊహించని ట్విస్టులున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని విభేదాల వల్ల తిరిగి హోం టీం ముంబైకి బదిలీ అవుతాడని అంతా భావించారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయిందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుండగా, ఫ్యాన్స్ కూడా హార్ధిక్ టీం మారడం ఖాయమని భావించారు. అయితే, ఆదివారం గుజరాత్ ప్రకటించిన రిటెన్షన్ లిస్టు వారి అంచనాలను తలకిందులు చేసింది. ఇదెక్కడి ట్విస్టురా బాబూ అంటూ అభిమానులు షాకయ్యారు.
ఇది కూడా చదవండి: IPL: ధోనీ ఫ్యాన్స్‌కు పండుగే.. రిటెన్షన్ లిస్టులో ‘మిస్టర్ కూల్’
గుజరాత్ విడుదల చేసిన రిటెన్షన్ లిస్ట్‌లో హార్ధిక్ పేరు కూడా ఉంది. హార్ధిక్‌ను 2022లో గుజరాత్ రూ. 15 కోట్లకు దక్కించుకుంది. ట్రేడ్‌లో భాగంగా దీన్ని గుజరాత్‌కు చెల్లించి కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్‌ను ముంబై వేలానికి వదిలేస్తుందన్న రూమర్లు వినిపించాయి. నెక్స్ట్ సీజన్ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్తారని కూడా ఫ్యాన్స్ అంచనాలు వేసుకున్నారు. అయితే, ఆదివారం గుజరాత్ ప్రకటించిన రిటెన్షన్ లిస్టు వీటన్నిటికీ బ్రేక్ వేసింది.
గుజరాత్ రిటెన్షన్ లిస్టు: హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియంసన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండె, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ.