Crime News: ముగ్గురుతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు..!

మదనపల్లెలో పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు యువకులతో యువతి ప్రేమాయణం నడిపింది. ఈ విషయాలు తెలుసుకున్న తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయుంచుకోవడంతో క్షణికావేశానికి గురైన హరిత తండ్రిపై దాడి చేసి చంపేసింది.

New Update
Crime News: ముగ్గురుతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు..!

Madanapalle Crime: పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని (Father) చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపిన యువతి కన్నతండ్రిని అతి దారుణంగా హత్య చేసి చంపింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఏకైక కుమార్తె..

దొర స్వామి (62) అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా (Govt Teacher) పని చేస్తున్నాడు. అయితే, ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందగా.. తన ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె పెళ్లి కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం ఆమెకు అప్పగించారు.

Also Read: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!

ఇద్దరే కాకుండా..

అయితే, హరిత మదనపల్లెకు చెందిన రమేశ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సాయి కృష్ణ అనే మరో యువకుడికి రూ. 8 లక్షలు ఇచ్చింది. ఈ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటోంది.

విచక్షణా రహితంగా..

ఈ విషయాలు తెలుసుకున్న దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయుంచుకున్నారు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమై నెల రోజులుగా తండ్రి కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసి చంపేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు