Crime News: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!

ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భర్త భార్యను గొంతునులిమి చంపాడు. మొదటి భార్య శైలజ వదిలేసి వెళ్లడంతో రెండో భార్య కళావతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల శైలజ తిరిగి రావడంతో మల్లయ్య, కళావతిని కడతేర్చాలని పథకం వేసినట్లు తెలుస్తోంది.

New Update
Crime News: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!

Khammam: భార్యను అతి దారుణంగా గొంతునులిమి చంపాడు ఓ భర్త. అయితే, ముందు గుండెపోటని కుటుంబసభ్యులను నమ్మించాలని చూశాడు. కానీ, భార్య డెడ్ బాడీపై గొంతునులిమిన గుర్తులు ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది.

రెండో వివాహం..

2011లో నేలకొండపల్లి మండలం బైరవునిపల్లికి చెందిన కళావతిని అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బుర్రా మల్లయ్య రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య శైలజ వదిలేసి వెళ్లడంతో రెండో భార్య కళావతిని వివాహం చేసుకుని ఖమ్మంలోని వికలాంగుల కాలనీలో కాపురం ఉంటున్నాడు.

Also Read: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. దేశంలో ఒకే ఒక్కడు!

గుండెపోటు..

ఇటీవల శైలజ తిరిగి రావడంతో మల్లయ్య, కళావతి మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో కళావతిని కడతేర్చాలని మల్లయ్య పథకం వేసినట్లు తెలుస్తోంది. మొదటి భార్య శైలజను పుట్టింటికి, రెండో భార్య కుమార్తెను అమ్మమ్మ వద్దకు పంపిన మల్లయ్య.. సోమవారం ఉదయం గుండెపోటుతో కళావతి మరణించినట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు.

గొంతునులిమి..

కళావతి మెడపై గొంతునులిమిన గుర్తులు ఉండటాన్ని గమనించి మల్లయ్యను కుటుంబసభ్యులు నిలదీశారు. దీంతో భార్య కళావతిని టవల్ తో గొంతునులిమి చంపినట్లు మల్లయ్య అంగీకరించాడని తెలుస్తోంది. కళావతి తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖమ్మం టూటౌన్ పోలీసులు. నిందితుడు బుర్రా మల్లయ్య ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు