Kolkata: హత్యకు ముందు కూడా మరో మహిళపై వేధింపులు.. కోలకతా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో ట్విస్ట్ ఇచ్చాడు. సీబీఐ విచారణలో నిజాలు ఒప్పుకున్న అతను..కోర్టులో మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినట్లు సమాచారం. అయితే సీబీఐ విచారణలో సంజయ్ రాయ్ హత్యకు ముందు మరో మహిళను కూడా వేధించినట్లు తెలిసింది. By Manogna alamuru 25 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Trainee Doctor Murder Accused Sanjay : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్మార్గానికి కారణం సంజయ్ రాయ్ (Sanjay Roy) ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ (CBI) టేక్‌ఓవర్ చేసింది. సీబీఐ విచారణలో నిందితుడు సంజయ్ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా సంజయ్ రాయ్‌కి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్ వాలంటీర్ తో కలిసి కోల్‌కతాలోని రెడ్‌లైట్ ఏరియాలకు వెళ్లినట్లు తెలిపాయి. వారిద్దరు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో మొదట సోనాగచికి వెళ్లారు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలుచోగా, అతడి స్నేహితుడు లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురిచేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అతడు మహిళను న్యూడ్ ఫొటోలు కావాలని అడిగినట్లు సమాచారం. ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్‌జీకార్ ఆసుపత్రి (RG Kar Hospital) కి చేరుకున్న నిందితుడు.. మొదట ఆపరేషన్ థియేటర్ తలుపును పగలగొట్టాడు. ఆ తర్వాత 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢ నిద్రలో ఉన్న బాధితురాలిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. Also Read: NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది–నాసా #sanjay-roy #kolkata-trainee-doctor-case #kolkata-abhaya-case #murder-accused మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి