Bhole Baba: కన్యలతో నగ్న స్నానాలు.. ఆ దుస్తుల్లోనే విందు: భోలే బాబా లైఫ్ స్టైల్‌లో విస్తుపోయే నిజాలు!

భోలే బాబా లైఫ్ స్టైల్‌కు సంబంధించి విస్తుపోయే నిజాలు బటయకొస్తున్నాయి. రాజస్థాన్ సహజపూర్‌ ఆశ్రమంలో కన్యపిల్లలతో స్నానాలు, పలుచనైన ఎర్రటి దుస్తులో విందు ఆరగిస్తారని స్థానికులు చెబుతున్నారు. అతని మహిమళను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారట. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి

Bhole Baba: కన్యలతో నగ్న స్నానాలు.. ఆ దుస్తుల్లోనే విందు: భోలే బాబా లైఫ్ స్టైల్‌లో విస్తుపోయే నిజాలు!
New Update

Bhole Baba Life Style: హత్రాస్ (Hathras) తొక్కిసలాటలో 121 మంది మరణాలకు కారణమైన భోలే బాబా లైఫ్ స్టైల్ కు సంబంధించి విస్తుపోయే నిజాలు బటయకొస్తున్నాయి. అందరి బాబాల్లాగే సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా సైతం మంచి రసికుడేనని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని సహజపూర్‌ గ్రామ శివారులో నారాయణ్‌ సాకర్‌ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది. ఇందులో జరిగే విషయాలు తంతు ప్రపంచానికి తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించగా.. తన సామ్రాజ్యంలో రాజా భోగాలు అనుభవించడంకోసం కన్యపిల్లలతో సేవ చేయించుకుంటాడట.

కన్యలతో నగ్న స్నానాలు..
అలాగే అతని చుట్టూ ఉంటే వర్జిన్ గర్ల్స్ అందరూ రెడ్ కలర్ డ్రెస్సింగ్ ధరించి ఆయనకు నగ్నంగా స్నానం చేయిస్తారట. అంతేకాదు కన్య పిల్లలు తినిపిస్తేనే భోజనం చేసి, వారు పక్కనుంటేనే నిద్రిస్తారట భోలే భాబా. ఇక వివాహితలను మాత్రం తన దారిదాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తారట. పెళ్లైన స్త్రీలు కనీసం తన ఆశీస్సులు తీసుకునేందుకు కూడా అనుమతించరని స్థానికులు చెబుతున్నారు.

గ్రామస్థులెవరూ పట్టించుకోరు..
భోలే బాబా ఆశ్రమం ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులతో నిండి ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వరు. భోలే బాబా ఆశ్రమంలో కేవలం మహిళా భక్తులకే ప్రవేశం ఉంటుంది. స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడులు చేస్తారని తెలిపారు. ఇక పదేళ్ల క్రితమే ఆశ్రమం కోసం గ్రామస్థుల భూమిని భోలే బాబా కొనుగోలు చేసినట్లు అక్కడి పంచాయితీ వార్డు మెంబరు పూల్‌ సింగ్‌ యాదవ్‌ మీడియాకు తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు మాత్రమే భోలే బాబాను దేవుడిగా కొలుస్తున్నారు. కానీ గ్రామస్థులెవరూ అతని మాయలు, అతీత శక్తుల గురించి పట్టించుకోరని చెబుతున్నారు.

#hathras #bhole-baba
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe