Amala Paul: నటి అమలాపాల్‌ మాజీ భర్త పై దాడి..కారు ఆపి మరీ!

నటి అమలాపాల్‌ మాజీ భర్త విజయ్‌ పై ఓ యువకుడు మద్యం మత్తులో దాడి చేశాడు. ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Amala Paul: నటి అమలాపాల్‌ మాజీ భర్త పై దాడి..కారు ఆపి మరీ!
New Update

AL Vijay: కన్నడ నటులు(Kollywood Actors) , డైరెక్టర్ల మీద అక్కడి ప్రజలు, అభిమానులు కొందరు పగబటినట్లు ఉన్నారు. నటులు కానీ, దర్శకులు కానీ బయట ఎక్కడైనా కనిపిస్తే వారి మీద బహిరంగంగానేదాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తళపతి విజయ్‌ (Thalapathy Vijay)  పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పును విసిరాడు. కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ కు (Caption VijayKanth) నివాళులు ఆర్పించడానికి వెళ్లిన విజయ్‌ పై ఈ దాడి జరిగింది.

దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి ఒక్కరోజు కూడా కాకముందే మరో కోలీవుడ్‌ డైరెక్టర్‌ పై దాడి జరిగింది. అతను ఎవరో కాదు..నటి అమలా పాల్‌ (AmalaPaul)  మాజీ భర్త ఏఎల్‌ విజయ్‌ (AL Vijay) . ఆయన ఎన్నో సినిమాలను తీసి మంచి డైరెక్టర్‌ గా కోలీవుడ్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం విజయ్‌ అరుణ్‌ విజయ్‌ తో కలిసి మిషన్‌ చాప్టర్‌ 1 అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్‌ కారుకు ఓ యువకుడు అడ్డంగా వచ్చి దాడికి దిగాడు. ఈ విషయం గురించి తన పై జరిగిన దాడి గురించి విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత దర్శకుడు విజయ్‌ ఈ సంఘటన గురించి మీడియాతో మాట్లాడాడు.

'' నేను కారులో మేనేజర్‌ మణివర్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్ష్‌ తో కలిసి టీనగర్‌ హబీబుల్లా రోడ్‌ లో కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి సడెన్‌ గా కారు ముందుకు వచ్చి ఆపాడు. అంతటితో ఆగకుండా అతని హెల్మెట్‌ పట్టుకుని కారును పలుమార్లు కొట్టాడు. అక్కడితో ఆగకుండా నా పై కూడా దాడి చేశాడు. యువకుడు చేసిన దాడిలో మా మేనేజర్‌ స్వల్పంగా గాయపడ్డాడు'' అని విజయ్‌ చెప్పుకొచ్చాడు.

విజయ్‌ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు యువకుడిని పట్టుకున్నారు. అతనిని ఐజాక్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. అతను మద్యం మత్తులో విజయ్‌ పై దాడికి దిగినట్లు గుర్తించమని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read: దుబాయ్‌ లో మహేష్‌..జపాన్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌..అల్లు అర్జున్‌…ఎక్కడంటే! 

#kollywood #attack #amalapaul #al-vijay
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe