Car Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. వివరాలివే..!!

కొత్తగా కారు కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. త్వరలోనే కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలకు చెందిన కార్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా కూడా కార్ల ధరలను భారీగా పెంచనుంది. పెంచిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

New Update
Car Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. వివరాలివే..!!

మీరు ఈ ఏడాదిలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ప్రముఖ వాహన తయారీదారు సంస్థ కియా ఇండియా సెల్టోస్, కరెన్స్ మోడళ్లను ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మోడళ్లపై 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. పెంచిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. రియల్ డ్రైవింగ్ ఏవిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని మోడళ్లను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో కాంపెనీ కార్లు ధరలను పెంచింది. అయితే ఏప్రిల్ తర్వాత చాలా కంపెనీలు మోడళ్ల ధరలను సవరించాయని కియా ఇండియా సేల్స్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దిప్ తెలిపారు.

ముడిసరుకు వ్యయం పెరగడం వల్ల కార్ల ధరలు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త సెల్టోస్ ను లాంచ్ చేశామని ఈ మోడల్ డెవలప్ మెంట్ కోసం భారీగా ఖర్చుర అయినట్లు తెలిపారు. అందుకే ధరలు పెంచేందుకు ఇదే సరైన సమయమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కాగా కియా ఇండియాలో చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ధరలను పెంచింది. అయితే కొత్త కర్భన ఉద్గారాలకు అనుగుణంగా కార్లను అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో అప్పుడు ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్…మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయక్కర్లేదు..!!

కాగా కేవలం 4 సంవత్సరాలలో, దక్షిణ కొరియా ఆటోమొబైల్ బ్రాండ్ కియా మోటార్స్, భారతీయ మార్కెట్లో టాప్ 5 కంపెనీలలో ఒకటిగా నిలిచింది, దాని యొక్క అత్యంత ప్రత్యేకమైన SUV సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసింది. ఇది చాలా మెరుగైన డిజైన్, అప్‌గ్రేడ్ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలయ్యింది. అన్ని కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. కొత్త సెల్టోస్ X లైన్, GT లైన్ మరియు టెక్ లైన్ అనే 3 ట్రిమ్ ఎంపికలలో పరిచయం చేసింది కంపెనీ. 2023 సెల్టోస్ 8 సింగిల్ టోన్‌లు, 2 డ్యూయల్ టోన్‌లు ప్రత్యేకమైన మ్యాట్ గ్రాఫైట్ కలర్ ఆప్షన్‌లో ఈ కారు మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది.

ఇది కూడా చదవండి: భారత్ ఒక్క అడుగు వెనక్కు వేస్తే..కెనడా పని ఖతం..!!

డిజైన్, టెక్నాలజీ, యూజర్ అనుభవం, పవర్‌ట్రెయిన్ పరంగా కొత్త సెల్టోస్ కు మంచి ఆదరణ లభించింది. Mosad అడ్వాన్స్‌డ్ ADAS 2.0తో అమర్చబడిన కొత్త సెల్టోస్‌లో 17 అడాప్టివ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయి. దీనితో పాటు, 32 భద్రతా లక్షణాలు కూడా ఈ మధ్యతరహా SUVని దాని విభాగంలో తదుపరి స్థాయికి తీసుకువెళతాయి. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ AC, 10.25 అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లేతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు