Remand For Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

లిక్కర్ స్కాం కేసులో కవిత‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈడీ, కవిత న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు కవితకు ఏడు రోజుల రిమాండ్ విధించింది.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

Seven Days Remand for MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) కవిత ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈడీ, కవిత న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు కవితకు ఏడు రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల వరకు కవితను కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

Also Read: కవితకు బలవంతంగా ఇంజక్షన్‌ పొడిచారు.. లాయర్‌ షాకింగ్‌ ప్రకటన!

కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే.. వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది. కాగా.. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించిన అనంతరం.. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పైవిధంగా కోర్టు తీర్పును వెలువరించింది.

అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. ‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. రామచంద్ర పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారు. కవితకు రామచంద్ర పిళ్లై బినామీగా ఉన్నారు. రామచంద్ర పిళ్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది. ఎంపీ మాగుంట ద్వారా రూ.30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చింది. ఈ రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వసం చేశారు.’ అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

ఎమ్మెల్సీ కవితకు హైబీపీ..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత హై బీపీ వచ్చిందని గతంలో ఎప్పుడు ఇలా కాలేదని.. ఓ మహిళా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఉపశమనం ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాదులు విజ్ఙప్తి చేశారు. కానీ కోర్టు వారి వాదనలకు తిరస్కరించి.. 7 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అలాగే కస్టడీలో ఉన్న కవితకు అసవరమైన మెడిసిన్, దుస్తులు, ఫుడ్ అందించవచ్చని లాయర్ కు కోర్టు తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు