Gudivada : ఎమ్మెల్యే కొడాలి నానికు బిగ్ షాక్.. వైసీపీ నుండి మరో కిలక నేత అవుట్..!

ఎమ్మెల్యే కోడాలి నానికు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ వైసీపీ నాయకుడు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి ఆహన్వించారు.

New Update
Gudivada : ఎమ్మెల్యే కొడాలి నానికు బిగ్ షాక్.. వైసీపీ నుండి మరో కిలక నేత అవుట్..!

Gudivada : గుడివాడలో ఎమ్మెల్యే కోడాలి నాని(Kodali Nani) కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ(YCP) నుండి మరో కిలక నేత అవుట్ అయ్యారు. టీడీపీ(TDP) అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో సీనియర్ వైసీపీ నాయకుడు, గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు టీడీపీలోకి చేరారు.

Also Read: టెన్త్ ఫలితాల్లో టాప్ ర్యాంక్.. రికార్డు సృష్టించిన మనస్వి..!

గుడివాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన(Janasena) ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జితో కలిసి దారం నరసింహారావు, బీసీ నాయకుడు కర్నాటి రాంబాబుకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గుడివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు.

Also Read: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!

గుడివాడలో 5ఏళ్లుగా బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు దారం నరసింహారావు. ఇచ్చిన మాటను స్థానిక ఎమ్మెల్యే నిలబెట్టుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. బీసీలకు హామీలు ఇస్తున్నారు కానీ అమలు చెయ్యడంలేదని వాపోయారు. నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న బీసీలకు కమ్యూనిటీ హాల్ కోసం బీసీ సంఘం ద్వారా ఎంతో కృషి చేస్తున్నామని.. అయితే, కమ్యూనిటీ హాల్ ఫైల్ 6నెలలుగా కమిషనర్ కార్యాలయం దాటి ముందుకు వెళ్ళని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో 6నెలల్లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు