Aroori Ramesh: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా

కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ  చేసే అవకాశం ఉంది.

Aroori Ramesh: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా
New Update

Aroori Ramesh Resigned For BRS Party: కేసీఆర్ కు షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. ఆయన బీజేపీలో (BJP) చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ (Warangal) నుంచి పోటీ  చేసే అవకాశం ఉంది.

కేసీఆర్ తో భేటీ..

కొన్ని రోజులుగా వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆయన నివాసిని వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన్ను కారులోకి ఎక్కించుకొని హైదరాబాద్ నందినగర్ లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆరూరి రమేష్ వివరణ ఇచ్చారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ (KCR) వద్దకు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాను అమిత్ షా ను (Amit Shah) కలిశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాజాగా ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ALSO READ: ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు

ఎంపీ టికెట్ కోసమే..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) బీజేపీలో చేరుతున్నట్లు గత కొంత రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగింది. బీజేపీలో చేరేందుకు ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో ఆయన మంతనాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారని.. ఈ క్రమంలో బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆరూరి రమేష్ కు బీజేపీ హైకమాండ్ వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఎంపీ టికెట్ కోసమే బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం.

#brs #bjp #lok-sabha-elections-2024 #aroori-ramesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe