/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/cm-jagan-3.jpg)
Volunteers Resignation In AP: ఏపీలో సీఎం జగన్‌కు మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించనీయవద్దని పిటిషన్ వేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. రాజీనామాలు అంగీకరిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్ల రాజీనామాపై విచారణ రేపటికి వాయిదా వేసింది.