Mothe Srilatha Shoban Reddy to Join Congress : లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరే బీఆర్ఎస్ (BRS) నేతల సంఖ్యల క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మరో నేత కారు దిగి హస్తం గూటికి చేరుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
మాజీ మంత్రి జంప్..
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ రోజు హస్తం(Congress) లో సభ్యత్వం తీసుకున్నారు నలుగురు నేతలు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, హైదరాబాద్ GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ వద్దు.. కాంగ్రెస్సే ముద్దు..
సొంత గూటికి చెలమల్ల కృష్ణా రెడ్డి చేరుకున్నారు. దీపదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన చలమల్ల.. టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అదే స్థానం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి.. టికెట్ దక్కకపోవడంతో బీఅర్ఎస్ లో చేరారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణా రెడ్డి తిరిగి మూడు రంగుల జెండా కప్పుకున్నారు. త్వరలో పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.