BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు

TG: మహేశ్వరంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, జిట్ట రాజేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు

BRS Leaders Joined BJP: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహేశ్వరం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, జిట్ట రాజేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి తనయుడు ముదిగంటి వెంకట్ శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు. వీరికి కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు.. 

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి లాగేసుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నుంచి మెజారిటీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. ఈ ప్రకారం చూస్తే బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో సగానికి పైగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలే ఉన్నారు.

బీబీ పాటిల్, సైదిరెడ్డి, ఆరూరి రమేష్, బూర నర్సయ్య గౌడ్, భరత్, ఈటల రాజేందర్ లాంటి నేతలను తమ పార్టీలో చేర్చుకొని తెలంగాణలో ఊసే లేని బీజేపీ క్రమంగా బలపడుతూ వస్తోంది. ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు